అమరావతి బంగారు బాతు.. జగన్ నాశనం చేస్తున్నారన్న చంద్రబాబు

Chandra Babu Hot Comments On Jaga

ఏపీ రాజధాని అమరావతి విషయంలో జగన్ యూటర్న్ తీసుకున్నాడని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు విమర్శించారు. అమరావతి బంగారు గుడ్డు పెట్టే బాతు లాంటిదని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలకు రాజధానిగా బ్రహ్మాండమైన నగరాలు ఉన్నాయని, ఏపీకి కూడా మంచి నగరం రాజధానిగా ఉండాలని గతంలో జగన్ అన్నారని గుర్తు చేసిన చంద్రబాబు కేవలం టిడిపి హయాంలో నిర్మించబడింది అన్న కక్షతోనే రాజధాని అమరావతిని విధ్వంసం చేయాలని జగన్ చూస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.

టీడీపీ ఎప్పుడూ ఒకే మాట మీద ఉన్నాదని తెలిపారు. అమరావతిని విధ్వంసం చేసి రైతులను అపహాస్యం చెయ్యాలని చూస్తున్నారని ఆరోపించారు. రైతులు ప్రభుత్వాన్ని నమ్మి 33 వేల ఎకరాలు ఇచ్చారని తెలిపారు. అలాంటి రైతులకు అన్యాయం చేయడం మంచిది కాదని హితవు పలికారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా తయారైంది అని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ కార్యాలయంలో వైసిపి నేతలు చెప్పిన పనులు జరిగే పరిస్థితి ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసు వ్యవస్థ నీరుగారి పోయింది అని, వైసీపీ నేతలకు తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థ విశ్వసనీయతతో పనిచేయాలని ఆయన సూచించారు. రాష్ట్రంలోని విద్యార్థులు ఏం చదువుకోవాలని ఎంచుకునే స్వేచ్ఛ ఉందని కానీ అలా కాకుండా ఇంగ్లీష్ మీడియం విద్య ద్వారా విద్యార్థుల హక్కులను హరిస్తున్నారు అని చంద్రబాబు పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేయొచ్చు గాని, అధికార వికేంద్రీకరణ చేసే రాష్ట్రం నష్టపోతుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్మోహన్ రెడ్డి తన వైఖరి మార్చుకోవాలని, రాజధాని విషయంలో నిర్ణయం మార్చుకోకుంటే అభివృద్ధిలో మరింత వెనకబడతామని చంద్రబాబు పేర్కొన్నారు.

tags : Amaravati, Capital, Golden Duck, Chandrababu, CM Jagan, Jagan Mohan Reddy  

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article