ఏపీ ఎన్నికల్లో గెలుపే టార్గెట్ గా చంద్రబాబు

చంద్రబాబు నాయుడు… అప్పుల రాష్ట్రంగా ఏపీని అప్పజేప్తే అభివృద్దే ధ్యేయంగా ముందుకు నడుస్తూ ఒడిడుకులను ఎదుర్కొంటున్నారు. అలాంటి చంద్రబాబు రానున్న ఎన్నికల నేపధ్యంలో పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. టీడీపీ అధ్య‌క్షుడు ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు త‌న పార్టీ ముఖ్యుల‌తో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు చేశారు. అసలేవిధంగానూ అభివేరుద్ధి చెయ్యని తెలంగాణా లోని టీఆర్ ఎస్ పార్టీ కి ఎన్నికల్లో 88 సీట్లు వస్తే ఎన్నో కష్టాల్లో కూడా ఎంతో అభివృద్ధి సాధించిన ఏపీలో మన పార్టీ కి ఎన్ని సీట్లు రావాలి అని ఆయన పార్టీ శ్రేణులతో మాట్లాడారు. నియోజ‌క‌వ‌ర్గాల అభివృద్ధి కార్య‌క్ర‌మాల స‌మీక్షతో పాటు రాబోయే ఎన్నిక‌లపై టెలికాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడిన చంద్ర‌బాబు ప‌నిచేయ‌ని పార్టీకి తెలంగాణ‌లో పట్టం కట్టారు. 88 సీట్లు ఇచ్చారు … ఇక ఎంతో అభివృద్ధి ప‌థంలో ప‌య‌నిస్తూ ముందుకు దూసుకెళ్తున్న తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు రావాలి అంటూ కేడ‌ర్‌ ను ప్రశ్నించారు. చేసిన పనిని జనాల్లోకి తీసుకెళ్తేనే మంచి మెజార్టీ సాధ్యమవుతుంది అని ఆయన పార్టీ ముఖ్య నాయకులను ఉద్దేశించి చెప్పారు.

ఇక టీడీపీ హయాంలో ఏపీలో పిల్ల‌ల నుంచి వృద్ధుల వ‌ర‌కు ప్రతి ఒక్కరి సంక్షేమానికి పెద్ద పీటవేశామని చెప్పుకొచ్చారు. ఇక రాష్ట్రంలో అన్ని వర్గాలకు ప్ర‌తి ఒక్క‌రికి సంక్షేమ ప‌థ‌కాల‌తో అండ‌గా ఉంటున్నామని ఆయన చెప్పారు. అంతే కాదు భ‌విష్య‌త్తు త‌రాల కోసం కూడా అవసరమైన ప్రగతి సాధించే పనిలో ఉన్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక చేసిన అభివృద్ధినిప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించిన ఆయన టార్గెట్ 150 అంటున్నారు. ఇక ఎన్నికల్లో ఫలితం మనం చేసింది ప్ర‌జ‌ల్లోకి స‌రిగా వెళ్ల‌డం అనే దాన్ని బ‌ట్టి ఉంటుంద‌న్నారు చంద్రబాబు . ఆంధ్రాలో నాటి పరిస్థితి , విభజన వల్ల ఆర్థిక లోటులో ఉన్న ఆంధ్ర‌ను ఎన్నో ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నామని అదంతా ప్రజలకు వివరించాలని పార్టీ ముఖ్యనేతలను ఆదేశించారు చంద్రబాబు . వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175 అసెంబ్లీ సీట్ల‌కు 150 గెల‌వాలి. 25 ఎంపీ సీట్ల‌ను సైతం మనమే గెలవాలని దిశా నిర్దేశం చేశారు చంద్ర‌బాబు. ఇక ఈ లక్ష్యంతో అందరూ కార్య క్షేత్రంలోకి దిగాలని సూచించారు. ఇది సాధ్య‌ప‌డాలంటే ప్ర‌భుత్వం అమ‌లు చేసిన సంక్షేమ ప‌థ‌కాల ద్వారా ఎవ‌రెంత మేర ల‌బ్ధి చెందార‌న్న విష‌యాన్ని కూడా ప్ర‌జ‌ల‌కు చేర‌వేయాల‌ని సూచించారు. ఇక దీని కోసం ఇప్పటి నుండే ప్రజాక్షేత్రంలోకి వెళ్లి యుద్ధ ప్రాతిపదికన అందరూ కష్టపడాలి అని చెప్పారు చంద్రబాబు.

ఇక చంద్రబాబు చెప్పింది బాగానే వుంది. అలాగే చేసిన అభివృద్ధి కూడా ఎంతో వుంది. కానీ జనాల మనసుల్లో నాటుకునేలా చెప్పగల నేతలు టీడీపీలో పెద్దగా లేరు. కేసీఆర్ ఏం అభివృద్ధి చెయ్యకున్నా సక్సెస్ అవ్వటానికి కారణం ఆయన చెప్పిన ముఖ్యమైన పథకాలు సగం లో ఆగాయి. కేసీఆర్ ను గెలిపించాకుంటే అవి అలాగే ఆగిపోతాయని భయపడిన ప్రజలు పట్టం కట్టారు. అంతే కాదు ప్రత్యర్ధి వర్గాల మీద దాడి కూడా ఆయన ప్రజల మనసుల్లో నాటుకునేలా చేస్తారు. అలా ఆయన్ని ప్రజలు ఆదరించారు. ఇక కేసీఆర్ అస‌లు బ‌లం ఏంటో గుర్తించ‌డంలో మాత్రం చంద్ర‌బాబు విఫ‌లం అవుతున్నారు. కేసీఆర్‌ను గెలిపిస్తున్న‌ది ముమ్మాటికీ ఆయన చెయ్యకున్నా జరిగిపోయినట్టు చూపించే మ్యాజిక్ మాటలే. అలా టీడీపీలో ఎవరికీ మాటలు చెప్పి మభ్యపెట్టటం రాదు. డ‌బుల్ బెడ్‌రూం, నీటి ప్రాజెక్టులు, ఉద్యోగాలు, మిష‌న్ భ‌గీర‌థ‌… ఈ నాలుగు పెండింగ్ ఉన్నా కూడా తాను వ‌స్తేనే అవ‌న్నీ నెర‌వేరుతాయ‌ని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించ‌డంతో సక్సెస్ సాధించిన కేసీఆర్ లా చెయ్యటం సాధ్యం కాదు. ఇక అభివృద్ధిలో చంద్ర‌బాబు సూప‌ర్ ఫాస్ట్ అయినా ఆయన చేసింది పెద్దగా చెప్పుకునే దానికే విపరీతమైన ప్రచారం కలిగేలా చేసే స్వభావం కాకపోవటం కూడా టీడీపీ ప్రచారంలో వెనకపడటానికి కారణం. ఇక ఐటీపై కేసీఆర్ చేసిన విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్ట‌డంలో చంద్రబాబు విఫ‌లం అయ్యారు. ఎక్కడైనా శంకుస్థాప‌న‌లే అభివృద్ధికి సూచిక‌లు అయితే వైఎస్‌ను మించినోడు లేడు. అన్ని శంఖుస్థాపనలు చేశారు. కానీ… ఏదైనా ప్రారంభిస్తే పూర్తయ్యే దాకా నిద్రపోని స్వభావం చంద్రబాబుది. కియా, పోల‌వ‌రం, కొత్త ఎయిర్‌పోర్టుల రాక‌, పాత ఎయిర్‌పోర్టుల అంత‌ర్జాతీయీక‌ర‌ణ, హుదూద్ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్‌ ఒకటేమిటి రాష్ట్ర వ్యాప్తంగా మౌలిక సదుపాయాల క‌ల్ప‌న‌ అన్నీ కూడా చంద్రబాబు సాధించిన విజయాలే. కానీ వాటిని ప్రచారంలోకి తీసుకెళ్ళే వారు లేకపోవటమే బాబుకు ఉన్న పెద్ద మైనస్.. ఇప్పటికి అయినా ఆ విషయంలో శ్రద్ధ పెట్టకుంటే చంద్రబాబు తీరా సమయానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది.

CHANDRA BABU NAIDU ASSEMBLY ELECTIONS PLAN

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article