chandrababu alliance with trump
ఏపీ అసెంబ్లీ సాక్షిగా మరోసారి తెలుగుదేశం పార్టీపై, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై మంత్రి అనీల్ కుమార్ సెటైర్లు వేశారు . ఈరోజు సభలో పార్టీ మారడం మరియు పొత్తులపై టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు చేసిన విమర్శలపై మాట్లాడిన అనీల్ కుమార్.. పొత్తు లేకపోతే ముద్ద దిగని పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీయే అని బల్లగుద్ది మరి చెప్పారు. పొత్తు లేనిదే ఎన్నికల్లో పోటీ చేయలేరంటూ టీడీపీని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ ,సీపీఐ, సీపీఎం, జనసేన ఇలా అన్ని పార్టీలు అయిపోయాయంటూ ఎద్దేవా చేశారు .
చంద్రబాబు అవసరమైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కూడా పొత్తు పెట్టుకోగలరని పొద్దున లేస్తే ఏ పార్టీ చంక ఎక్కుదామా, ఏ పార్టీ కాళ్లు మొక్కుదామా అని బాబు ఆలోచిస్తుంటారు అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు . అలాంటి టీడీపీ నేతలు పొత్తులు గురించి మాట్లాడుతున్నారు కొంచెం సిగ్గుండాలి అసలు అంటూ సభలో నిప్పులు చెరిగారు. కానీ సీఎం జగన్ సింహం లాంటివాడని ఆయన నాయకత్వంలో వైసీపీ సింగిల్ గానే పోటీ చేస్తుందని 2024లో కూడా తాము ఒంటరి గానే పోటీ కి దిగుతామని వైసీపీ పొత్తుల కోసం చూసే పార్టీ కాదని స్పష్టం చేశారు. అలాగే 2024లో పొత్తు లేకుండా ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పే ధైర్యం టీడీపీ కి ఉందా అంటూ సవాల్ విసిరారు. ఇక మీరు జోలి పట్టుకునే టైమ్ అయింది బయర్దేరండి మొత్తం రాష్ట్రాన్ని దోచుకున్నారు. ఇప్పుడు కొత్తగా జోలి పడుతున్నారు. గతంలో సెక్రటేరియట్ లో హుండీ పెట్టారు. ఆ హుండీ డబ్బులు ఎక్కడికి పోయాయో ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడు జోలి పడుతున్నారు. ఈ డబ్బులు ఎక్కడికి పోతాయో ఎవ్వరికీ తెలీదు. అంటూ అనిల్ కుమార్ టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.