నేడు ఢిల్లీ వేదికగా చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష

Chandrababu Dharma Poratha Deeksha

ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద 12 గంటల పాటు ధర్నా నిర్వహించనున్నారు.ఏపీ భవన్ వేదికగా 12 గంటల పాటు నిర్వహించే ధర్మపోరాట దీక్షలో పలు జాతీయ పార్టీల నేతలు కూడ పాల్గొనే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆదివారం నాడు రాత్రిపూట ఢిల్లీకి బయలుదేరిన ఆయన నేడు దీక్షలో పాల్గొంటారు .ఏపీలో బాబు దీక్షలో టీడీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు. మరో వైపు ఈ దీక్షలో పాల్గొనేందుకు రెండు ప్రత్యేక రైళ్లలో టీడీపీ కార్యకర్తలు, నేతలు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రేపు ఉదయానికి టీడీపీ కార్యకర్తలు, నేతలు ఢిల్లీకి చేరుకొంటారు. చంద్రబాబు తలపెట్టిన ధర్మ పోరాట దీక్షకు దేశ వ్యాప్తంగా ఉన్న 22 ప్రాంతీయ పార్టీల మద్దతు లభించింది. ఇదిలా ఉంటే సోమవారం ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు బాబు దీక్ష నిర్వహిస్తారు. ఈ నెల 12వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను టీడీపీ ప్రతినిధి బృందం కలవనుంది.ఏపీకి పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని,ఎపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని బాబు ధర్నా నిర్వహిస్తారు. ఈ ధర్మ పోరాట దీక్ష ద్వారా చంద్రబాబు దేశం దృష్టిని ఏపీ విషయంలో కేంద్రం చేసిన అన్యాయంపై పడేలా చెయ్యాలని భావిస్తున్నారు. తద్వారా బీజేపీ సర్కార్ పై వత్తిడి తెచ్చి ఎలాగైనా ప్రత్యేక హోదా సాధించాలనే సంకల్పంతో ఈ దీక్ష చెయ్యనున్నారు.

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article