తోడల్లుడిపై చంద్రబాబు ఫైర్

Chandrababu Fire on Daggupati Venkateswarao … దగ్గుపాటి మారని పార్టీలు లేవు

రానున్న ఎన్నికల నేపథ్యంలో కుమారుడి రాజకీయ భవితవ్యం కోసం దగ్గుపాటి వెంకటేశ్వరరావు, తన కుమారుడు హితేష్ చెంచు రామ్ తో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా జగన్ తో భేటీ అయి పలు రాజకీయ విషయాలపై చర్చించారు. తర్వాత మీడియాతో మాట్లాడిన దగ్గుబాటి వెంకటేశ్వర రావు అధికార పార్టీపై ఆరోపణలు చేశారు. త్వరలో వైసీపీలో చేరబోతున్నట్లు గా ప్రకటించారు. ఇక దగ్గుబాటి వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు తోడల్లుడు తీరును ఎండగట్టారు. మారిన పార్టీ ఏదైనా ఉందా అంటూ ప్రశ్నించారు.
జగన్‌తో దగ్గుబాటి వెంకటేశ్వరరావు భేటీపై సీఎం చంద్రబాబు స్పందించారు. అవకాశవాదులంతా వైసీపీ గూటికి చేరుతున్నారని విమర్శించారు. ఆర్ఎస్‌ఎస్‌ మొదలు అన్ని పార్టీల ప్రదక్షిణలు చేసిన దగ్గుబాటి దంపతులు బీజేపీ నుంచి కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ నుంచి బీజేపీ ఇప్పుడు వైసీపీలో చేరుతున్నారని అన్నారు. వీరి అవకాశవాదంతో ఎన్టీఆర్‌కు అప్రదిష్ట తెస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అధికారం కోసమే లక్ష్మీపార్వతి వైసీపీతో కుమ్మక్కైందని ఆరోపించారు. అవకాశవాదంతోనే ఆనాడు ఎన్టీఆర్‌ను వాడుకున్నారని, అవకాశవాదులంతా వైసీపీ గూటికి చేరారని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇక దగ్గుపాటి కుటుంబం మారని పార్టీలు లేవని చంద్రబాబు అన్నారు. ప్రజలను మభ్యపెట్టాలనేదే జగన్ అజెండా అని, అభివృద్ధిపై జగన్‌కు ఒక అజెండా అనేది లేదని ఎద్దేవా చేసిన చంద్రబాబు అవకాశావాదులంతా ఒక చోట చేరారని కుట్రలు, కుతంత్రలే వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల ప్రధాన అజెండా అని ముఖ్యమంత్రి మండిపడ్డారు.

Check Out Latest Offers in Amazon

For more Filmy News

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article