క్యాపిట‌ల్ అనే మాట రాజ్యంగంలో లేదా…

Chandrababu Fires on CM Jagan

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ వేదికగా రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. ప్ర‌తిప‌క్షం, అధికార‌ప‌క్షం ఎవ‌రికి వారు విమ‌ర్శ‌లు చేసుకుంటూ స‌మావేశాల‌ను కానిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌స్తుతం మూడు రాజ‌ధానుల అంశం హాట్ టాపిక్‌. రాష్ట్రంలో అభివ్రుద్ధి వికేంద్రీక‌ర‌ణ జ‌ర‌గాల‌న్న‌ది వైసీపీ ప్ర‌భుత్వం మాట‌. అయితే రాష్ట్రానికి ఒకే రాజ‌ధాని ఉండాల‌ని, మూడు రాజ‌ధానులు ఉంటే ఫ్యూజ‌ర్‌లో అనేక ఆర్థిక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయంటుంది ప్ర‌తిప‌క్షం. అయితే తాజాగా అసెంబ్లీ పోరుపై చంద్ర‌బాబు సీఎం జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌ను త‌ప్ప‌బ‌డుతూ కామెంట్స్ చేశారు.

వివ‌రాల‌లోకి వెళితే… ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహనరెడ్డి వ్యాఖ్యలను ప్రతిపక్ష‌ నేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా వ్యతిరేకించాడు. ఈ మేరకు ఆయన సీఎం జగన్ పై మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఎక్కడి నుంచైనా పాలన చేయవచ్చని జగన్ చేసిన కామెంట్స్‌ని ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. ఈ మేర‌కు చంద్ర‌బాబు మాట్లాడుతూ…సీఎం జ‌గ‌న్ చెప్తున్న మాట‌ల‌న్నీ అబ‌ద్ధాలేనంటూ మండిప‌డ్డారు. అదేవిధంగా క్యాపిట‌ల్ అనే మాట రాజ్యంగంలో ఎక్క‌డా లేద‌న్న జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌పై చంద్ర‌బాబు ఏమ‌న్నారంటే.. రాజ్యాంగంలో కేపిటల్ పదమే లేదనడం పచ్చి అబద్ధమని ఆయన వ్యాఖ్యానించారు.

Chandrababu Fires on CM Jagan,#AP CM Jagan,#Chandrababu,AP Assembly,Jagan Unfair Words,AP Political War,3 capital,no capital word in Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *