చంద్రబాబు అరెస్ట్ .. ఎయిర్ పోర్ట్ వద్ద టెన్షన్

Chandrababu has been arrested by Visakha police

విశాఖలో చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది . చంద్రబాబు ఎలాగైనా పర్యటన చెయ్యాలని టీడీపీ, చంద్రబాబును అనుమతించేది లేదని వైసీపీ అక్కడ బాహాబాహీకి దిగటంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది . ఇక ఈ నేపధ్యంలో ఎయిర్ పోర్ట్ వద్దే బైఠాయించి నిరసన తెలియజేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 151 సెక్షన్ కింద చంద్రబాబును అదుపులోకి తీసుకుని విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లోకి తరలించారు. పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకు ఆయన్ను నిర్బంధింలోనే ఉంచాలని పోలీసులు యోచిస్తున్నారు.

ఆయనతో పాటు ఉన్న టీడీపీ నేతలను, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదయం నుంచి ఎయిర్‌పోర్టు వద్ద హైడ్రామా చోటుచేసుకున్న నేపధ్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారు . ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఈ ఉదయం చంద్రబాబు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు తరలివచ్చారు. మరోవైపు వైసీపీ శ్రేణులు కూడా తరలివచ్చి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు, నేతల నినాదాలతో వాతావరణ ఒక్కసారిగా హీటెక్కింది. చంద్రబాబు కాన్వాయ్‌పై కోడిగుడ్లు, టమోటాలతో వైసీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. కొన్ని గంటల పాటు చంద్రబాబు వాహనంలోనే ఉండి పోయారు. నాటకీయ  పరిణామాల మధ్య చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు .

Chandrababu has been arrested by Visakha police,chandrababu, vishakhapatnam, praja chaitanya yathra , airport , ycp leaders , tdp , police, arrest

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article