జగన్ ముద్దులు చూసి ప్రజలు మోసపోయారు

జగన్ ముద్దులు చూసి ప్రజలు మోసపోయారు
అనంత పార్టీ భేటీలో చంద్రబాబు నాయుడు
అనంతపురం
ఉమ్మడి అనంతపురం జిల్లా కార్యకర్తల సమావేశంలో టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పాల్గోన్నారు. వేలాది గా తరలివచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ హయాం నుంచి అనంతపురం జిల్లా టిడిపికి కంచుకోట. 2014లో 14 సీట్లకు గాను 12 సీట్లు గెలిపించిన జిల్లా అనంతపురం. రాష్ట్రంలో ప్రభుత్వ బాదుడు భయంకరంగా ఉంది. కార్యకర్తలకు ఒక్క అడుగు వేస్తే…ప్రజలు పది అడుగులు వేస్తున్నారు. ప్రజల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత చూసి క్యాడర్ కు కిక్కు ఎక్కింది. అనంతపురానికి కియా పరిశ్రమ వస్తుంది అని ఎవరైనా ఊహించారా? 30 వేల మందికి ఉపాధి కియా ద్వారా వస్తుంది. ఈ మూడేళ్లలో ఒక్క పరిశ్రమ వచ్చిందా….? జిల్లాలో జాకీ పరిశ్రమ వైసిపి రౌడీ ఇజానికి భయపడి పారిపోయింది. జగన్ ముద్దులు చూసి అనంత ప్రజలు కూడా మోస పోయారు. ఇప్పుడు జగన్ పాలన అంతా బాదుడు..గుద్దుడు. సొంత జేబులు నింపుకోవడానికి జగన్ జె బ్రాండ్స్ మద్యం తీసుకు వచ్చారు. జగన్ చెప్పిన సుబ్రహ్మణ్యం అన్న….సవాంగ్ అన్న ఏమయ్యారు? ప్రధాన కార్యదర్శిగా ఉన్న సుబ్రహ్మణ్యం ను చివరికి కుర్చీలేని పోస్టుకు పంపారు. మనపై కేసులు పెట్టి వేధించిన డిజిపి సవాంగ్ చివరికి ఏమయ్యారు. అనంతకు మూడేళ్లలో ఏం చేశారో చర్చకు సిద్దమా అని ప్రశ్నించారు. కర్నూలులో సోలార్ ప్రాజెక్టుపై విమర్శలు చేసి…సిగ్గు లేకుండా ఇప్పుడు ప్రారంభించారు. ఎప్పుడు ఎన్నికలు జరిగిని అనంత ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించాలి. గంజాయికి అలవాటు పడి యువత పక్కదోవ పడుతుంది. దద్దమ్మ సిఎం గంజాయి సరఫరాను అరికట్టకపోవడం వల్లనే ఇప్పుడు ఇన్ని అనర్థాలని అన్నారు. ఇప్పుడు జరిగిన భూ కబ్జాలపై అధికారంలోకి వచ్చిన తరువాత విచారణ చేసి చర్యలుంటాయని అన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article