Chandrababu Naidu To Hold TDP Meeting
ఏపీలో రాజకీయం రసవత్తరంగా సాగుతుంది . వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటుకు శరవేగంగా పావులు కదుపుతుంటే ప్రతిపక్ష పార్టీలు రాజధాని రైతులకు మద్దతుగా పోరాటం చేస్తూ ఆందోళనలకే పరిమితం అవుతున్నాయి. ఇక నేడు చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్ఛార్జ్లు, జిల్లా అధ్యక్షులు, సీనియర్లు అంతా ఈ మీటింగ్ లో పాల్గొననున్నారు . స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఎలాంటి వ్యూహం ఉండాలనే దానిపై చర్చించేందుకే ఈ మీటింగ్ నిర్వహించనున్నారు . అటు, రాజధాని అమరావతిపై పోరాటం ముందుకు తీసుకెళ్లడంపైనా చంద్రబాబు సమీక్షించనున్నారు . పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకుని ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటానికి కార్యాచరణ రూపొందించడంపై చర్చిస్తారు. అలాగే గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులకు వేధింపుల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి టీడీపీ నేడు తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
Chandrababu Naidu To Hold TDP Meeting,tdp , andhra pradesh , ycp