కుప్పంలో పులివెందుల రౌడీయిజం సాగనివ్వను…

144
Chandrababu Praja Chaitanya Yatra
Chandrababu Praja Chaitanya Yatra

Chandrababu Praja Chaitanya Yatra in Kuppam

టీడీపీ చీఫ్ చంద్రబాబు వైసీపీ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుప్పంలో ప్రజా చైతన్య యాత్రలో పాల్గొన్న మాజీ సీఎం చంద్రబాబు  జగన్ లాంటి  చెత్త సీఎం చూడలేంటున్నారు చంద్రబాబు. వివిధ అంశాలను ఆయన తెరమీదకు తెస్తూ విమర్శల వాన కురిపిస్తున్నారు. ఇరుపార్టీలకు చెందిన నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రధానంగా టీడీపీ జగన్‌ను టార్గెట్ చేసింది. సోషల్ మీడియా వేదికగా ఆయనపై సెటైర్లు వేస్తున్నారు. మూడు రాజధానులు, ఇతరత్రా అంశాలపై టీడీపీ పోరు సాగిస్తోంది. కుప్పంలో టీడీపీ ప్రజా చైతన్య యాత్ర నిర్వహించింది. కుప్పంలో పులివెందుల రౌడీయిజం సాగినివ్వమని హెచ్చరించారు. రౌడీయిజం చేస్తే మాత్రం..ప్రజాస్వామ్యంలో దోషులుగా నిలబెడుతామన్నారు. తాము అధికారంలో ఉన్న సమయంలో కక్ష సాధింపుతో వ్యవహరిస్తే..బయట తిరిగేవారా ? అంటూ సూటిగా ప్రశ్నించారు. 9 నెలల జగన్ పాలన నరకాసుర పాలనగా అభివర్ణించారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని ఉండాలని మరోసారి స్పష్టం చేశారు.విశాఖపట్టణం వెళ్లి..వైసీపీ నేతల భూ బాగోతాన్ని బయటపెడుతామన్నారు. ధైర్యం ఉంటే సీఎం జగన్ తన ఆస్తులను ప్రకటించాలని డిమాండ్ చేశారు. జగన్ ఆస్తులన్నీ బినామీ పేర్లతో ఉన్నాయని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని కుప్పం నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.

Chandrababu Praja Chaitanya Yatra in Kuppam,kuppam , chandrababu, ycp , praja chaitanya yathra , ys jagan, ycp government,ap politics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here