ఆ పని చేస్తే జనసేన బీజేపీల పొత్తులను స్వాగతిస్తా

Chandrababu reacts on Janasena, BJP alliance

బీజేపీ జనసేనల పొత్తులపై ఏపీ మాజీ సీఎం  చంద్రబాబు నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు . పశ్చిమ గోదావరి జిల్లాలో అమరావతి పరిరక్షణ కోసం ప్రజా చైతన్య యాత్రలో పాల్గొన్న సందర్భంగా చంద్రబాబు జనసేన , బీజేపీ లపై వ్యాఖ్యలు చేశారు.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ చేయి కలిపిన  నేపధ్యంలో దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తొలిసారిగా స్పందించారు. పొత్తులు పెట్టుకున్న పార్టీలు ఏపీ రాజధాని వ్యవహారంలో పోరాటం చెయ్యాలని ఆయన అన్నారు. రాజధాని అమరావతిని తరలించాలన్న సీఎం జగన్ నిర్ణయంపై జనసేన-బీజేపీ కూటమి పోరాడేట్టయితే వారి కలయికను  స్వాగతిస్తానని వెల్లడించారు.

పవన్ కల్యాణ్ గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, సంతోషం. అమరావతిని కొనసాగించడానికి మీ పొత్తును ఉపయోగిస్తే మనస్ఫూర్తిగా అభినందిస్తాను. కానీ జగన్ అరాచకాలకు మీరు కూడా భయపడిపోయి, పోరాడకపోతే ఉపయోగంలేదు అని వ్యాఖ్యానించారు. ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకున్నా రాజధాని అమరావతి కోసం పని చెయ్యటమే లక్ష్యంగా ఉండాలని చంద్రబాబు మరోమారు స్పష్టం చేశారు .

Chandrababu reacts on Janasena, BJP alliance,chandrababu , tdp, bjp, janasena, alliance, capital amaravati, ap capital , pavan kalyan

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article