శివాజీ నీకు ఆ అవకాశం ఇవ్వను

Chandrababu rejected to give chance to Shivaji

శివాజీ పై బాబు సెటైర్

ఏపీ రాజకీయలపై శివాజీ ఎప్పుడు మాట్లాడినా హాట్ టాపిక్ గానే వుంటుంది. కేంద్రం ఏపీ ప్రభుత్వంపై కుట్రలు చేస్తుందని ఆపరేషన్ గరుడ లో భాగంగా కేంద్ర సంస్థలతో దాడులు చేస్తుందని శివాజీ చెప్పారు. అలాగే జరిగింది. ఇక ప్రతిపక్ష నేతపై హాని లేని దాడి జరుగుతుంది అని కూడా శివాజీ చెప్పారు. అది కూడా శివాజీ చెప్పినట్టే జరిగింది. శివాజీ టీడీపీ లో లేకున్నా చంద్రబాబును రక్షించే ప్రయత్నం చేస్తున్నారని మొదట నుండీ అందరూ అభిప్రాయ పడ్డారు. ఈ నేపధ్యంలోనే టీడీపీ లో చేరతారా అంటే నాకు హక్కు లేదా ? తప్పక రాజకీయాల్లోకి వస్తాను.. టీడీపీ లో చేరితే తప్పేంటి అని సినీనటుడు శివాజీ ప్రశ్నించారు. అంతే కాదు చంద్రబాబు నాయుడికి ఒక విషయంలో అల్టిమేటం జారీ చేశారు.
తాజా పరిణామాల నేపధ్యంలో శివాజీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చారు. చుక్కల భూముల సమస్య పరిష్కరించాకుంటే ఆమరణ దీషకు దిగుతానని శివాజీ చెప్పిన దానికి చంద్రబాబు స్పందించారు. ఇక ఈ విషయంలో ఆయన శివాజీ నీకు ఆ అవకాశం ఇవ్వను అంటూ సెటైర్ వేశారు. చుక్కల భూముల సమస్యలపై సీఎం చంద్రబాబును సినీ నటుడు శివాజీ అమరావతిలో కలిశారు. చుక్కల భూముల సమస్యపై చర్చించారు. చుక్కల భూములతో మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పరిష్కరించకుంటే పోరాటం చేస్తానని చంద్రబాబుకు స్పష్టం చేసినట్లు తెలిపారు. దాంతో స్పందించిన సీఎం నీకు అవకాశం ఇవ్వను ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చానని చెప్పినట్లు చెప్పుకొచ్చారు. చంద్రబాబుతో ఎలాంటి రాజకీయ అంశాలు చర్చించలేదన్నారు.
ఇకపోతే చుక్కల భూముల వ్యవహారంలో కొందరు అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని శివాజీ ఇటీవలే ఆరోపించారు. ముగ్గురు ఐఏఎస్ అధికారులు ఈ ఫైల్ పై చర్చ రాకుండా అడ్డుకుంటున్నారంటూ మండిపడ్డారు. కనీసం మంత్రుల మాటలను కూడా కొందరు కలెక్టర్లు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆ అధికారులకు రాజకీయ పార్టీలంటే ఇష్టమని అంత ఇష్టం ఉన్నవాళ్లు పదవులకు రాజీనామా చేసి ఆయా పార్టీల్లోకి వెళ్లాల్సిందని చెప్పారు. చుక్కభూముల సమస్యలను సంక్రాంతిలోపు ఆమరణ దీక్ష చేపడతానని శివాజీ హెచ్చరించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article