జయహో బీసీ సభలో బీసీల పాట పాడిన చంద్రబాబు

Chandrababu Sang BC Song in BC meet .. రీజన్ ఇదే

ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జయహో బిసి అన్నారు. బీసీలు ఓటు బ్యాంకు టిడిపికి ఉంటుందని చంద్రబాబు గుర్తు చేశారు. బీసీలు ఎవరు వైసీపీ బీజేపీ ల ట్రాప్ లో పడొద్దు అంటూ సూచించిన చంద్రబాబు బీసీలకు వరాల జల్లు కురిపించారు. రాజమండ్రిలో టిడిపి ఆధ్వర్యంలో నిర్వహించిన జయహో బిసి సదస్సులు మాట్లాడిన చంద్రబాబు బీసీ సంక్షేమం కోసం ఇప్పటి వరకు తమ ప్రభుత్వం ఏ విధంగా కట్టుబడి ఉందో వివరించారు. బీసీలకు న్యాయం చేసిన పార్టీ టీడీపీయేనని ఆయన గుర్తు చేశారు. బీసీ నేతలను ఢిల్లీకి పంపిన ఘనత టీడీపీదేనని ఆయన చెప్పారు. తెలంగాణ ఏపీ రాష్ట్రాల పార్టీల అధ్యక్షులు బీసీ నేతలను చెప్పిన చంద్రబాబు అన్ని వ్యవస్థల్లోనూ బీసీలకు టిడిపి గుర్తింపునిచ్చింది అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా బిసి సామాజిక వర్గానికి కేబినెట్లో ఇంతగా స్థానం ఇవ్వలేదని చంద్రబాబు గుర్తు చేశారు. బీసీలను వైయస్సార్ అణగదొక్కారని చెప్పరా బాబు ఉద్యోగాల్లో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నామని తెలిపారు.
యాదవుల కోసం ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశయన, యాత, గౌడ,యాదవ,తూర్పుకాపు, కొప్పుల వెలమల కోసం ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఇక నుండి ప్రతి చేనేత కార్మికులకు 150 యూనిట్ల విద్యుత్‌ను ఇవ్వనున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.హెయిర్ సెలూన్లలో 150 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ను ఇస్తామని బాబు హామీ ఇచ్చారు.వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేరుస్తామని బాబు తెలిపారు.
జడ్జీల నియామకాల్లో కూడ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని సిఫారసు చేసినట్టు బాబు గుర్తు చేశారు. అమరావతిలో బీసీల కోసం బీసీ భవన్ ను రూ.100 కోట్లతో నిర్మించనున్నట్టు బాబు హమీ ఇచ్చారు. బీసీ ఫైనాన్స్ కార్పోరేషన్‌కు రూ.1.143 కోట్లను ఇచ్చినట్టు ఆయన తెలిపారు.
ఇక బీసీలకు ఆధునిక పనిముట్లను అందించినట్టు చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. టీటీడీ ఛైర్మెన్‌గా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నియమిస్తే తప్పుడు ఆరోపణలు చేశారని చంద్రబాబునాయుడు చెప్పారు.767 జీవోను రద్దు చేసి గీత కార్మికుల పొట్టను కొట్టిందని చంద్రబాబునాయుడు చెప్పారు. నేత కార్మికులకు రూ.111 కోట్లు రుణమాఫీ చేశామన్నారు చంద్రబాబునాయుడు. తెలుగుదేశం పార్టీకి బీసీలు ఎప్పుడు అండగా ఉన్నారని, బీసీలు తమతో ఉన్నంతకాలం తమను ఎవరూ ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేసిన చంద్రబాబు బీసీ సంక్షేమం కోసం పాటుపడిన పార్టీ తెలుగుదేశం పార్టీయేనని చెప్పుకొచ్చారు.

ఇక బీసీలు ఓటు బ్యాంకు టార్గెట్ గా చంద్రబాబు జయహో బిసి అంటున్నారని, ఇదంతా ఓటు బ్యాంకు రాజకీయాలని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. ఎన్నికలు జరగనున్న సమయంలో ఇలాంటి పాటలు, పాట్లు తప్పవు అని మీ రాజకీయాలను చూస్తున్న సదరు ఓటరు భావన.

Check Out Latest Offers in Amazon

For more Filmy News

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article