ముదురుతున్న పొలిటికల్ వార్

Chandrababu VS Modi – చంద్రబాబు వర్సెస్ మోడీ …

చంద్రబాబు వర్సెస్ మోడీ … మోడీ ఏపీ పర్యటన నేపధ్యంలో ఒకర్ని మించి ఒకరు విమర్శల వర్షం కురిపించారు ఇరువురు నేతలు. ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గుంటూరులో సభ నిర్వహించిన మోడీ మహా కూటమి అపవిత్ర కలయిక అంటూ విమర్శించారు.ఏపీ ప్రజల అభివృద్ధిని వదిలేసి తన కొడుకు అభివృద్ధి కోసం చంద్రబాబు పాటుపడుతున్నారన్నారు. మామను వెన్నుపోటు పొడవడంలో బాబు సీనియర్ అంటూ మోడీ ఎద్దేవా చేశారు. గుంటూరు వేదికగా బాబుపై మోడీ తీవ్ర విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఓటమి పాలు కానుందని మోడీ జోస్యం చెప్పారు. ఇక చంద్రబాబుపై విమర్శలు చేసిన మోడీ పార్టీలు ఫిరాయింపులు చేయడంలో సీనియర్లన్నారు. కొత్త కొత్త కూటములను కట్టగట్టడంలో కూడ సీనియర్ అని చెప్పారు.ఇవాళ ఎవరిని తిడుతారో…ఆ తర్వాత వారి ఒడిలో కూర్చోవడంలో కూడ మీరే సీనియర్‌ అంటూ బాబుపై విమర్శలు గుప్పించారు.ప్రతి ఎన్నికల్లో ఓటమి పాలు కావడం కూడ మీరే సీనియర్ అంటూ బాబును ఉద్దేశించి మోడీ విమర్శించారు. మామను వెన్నుపోటు పొడవడంలో కూడ మీరే సీనియర్ అంటూ ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ రాజకీయ వారసులిగా వచ్చిన మీరు…. ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నారా…. ఎన్టీఆర్‌కు గౌరవం ఇచ్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు రాష్ట్రాభివృద్ధిని వదిలి పెట్టి నన్ను తిట్టడమే పనిగా పెట్టుకొన్నారని చెప్పారు.
మీరు సీనియర్‌ నేత…. కానీ, మీకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఏనాడూ విస్మరించలేదన్నారు. బాబు నాకంటే సీనియర్… ఇందులో వివాదం లేదని మోడీ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు చంద్రబాబునాయుడు తన స్టిక్కర్లు వేసుకొంటున్నారని మోడీ విమర్శించారు.ఏపీ ప్రజల కలలను ధ్వంసం చేయడంలో కూడ సీనియర్ అన్నారు మోడీ . ఎన్టీఆర్ కలలను కూడ బాబు ధ్వంసం చేశాడన్నారు. కూలిపోయిన తన పార్టీని నిర్మించుకోవడంలో చంద్రబాబునాయుడు బిజీగా ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు.కేంద్రం నుండి ఎన్ని నిధులు ఇచ్చామో చెప్పమంటే బాబు లెక్కలు చెప్పడం లేదన్నారు.
ఢిల్లీలో దీక్ష పేరుతో ఫోటోలు తీయించుకొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రేపు ఢిల్లీకి వస్తున్నారని చెప్పారు. ఈ దీక్షకు నిధులు ఎక్కడివో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు .డిక్షనరీలోని తిట్లన్నీ కూడ తనను తిట్టేందుకు బాబు ఉపయోగిస్తున్నారని చెప్పారు.వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ఓటమి పాలు కానుందన్నారు. ప్రజలు ఏపీ సర్కార్‌కు వ్యతిరేకంగా తీర్పును ఇవ్వనున్నారని మోడీ అభిప్రాయపడ్డారు.ఏపీలోని తండ్రీ కొడుకుల పాలన అంతం కానుందన్నారు.
కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తోందన్నారు. అందుకే తమను గో బ్యాక్ అంటున్నారని మోడీ చమత్కరించారు. తన పర్యటన సందర్భంగా నల్ల బెలూన్లను ఎగురవేయడాన్ని ఆయన ప్రస్తావిస్తూ… ఏదైనా కొత్త కార్యక్రమం ప్రారంభించే సమయంలో దిష్టి తీయడం సంప్రదాయమన్నారు. మీ నల్ల బెలూన్లతో నా కార్యక్రమానికి దిష్టి తీశారని భావిస్తున్నట్టు మోడీ చెప్పారు.
ఇక మోడీ పై చంద్రబాబు సైతం తీవ్రంగా ధ్వజమెత్తారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా మోడీ మోసం చేశారని … ఈ విషయమై నిలదీస్తే మౌనంగా ఉన్నారని చెప్పారు. తాను ఏనాడూ యూ టర్న్ తీసుకోలేదన్నారు చంద్రబాబు. రాష్ట్ర ప్రజల కోసం రైట్ టర్న్ తీసుకొన్నట్టు చెప్పారు. మాట తప్పిన మోడీ మాత్రమే యూ టర్న్ తీసుకొన్నారన్నారాయన. గురువుకు పంగనామాలు పెట్టిన చరిత్ర మోడీది అంటూ చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.మోడీ సర్కార్ తప్పుడు విధానాలను అవలంభిస్తోందన్నారు. ఐటీ, ఈడీ దాడులతో భయపెట్టాలని చూస్తున్నారని చెప్పారు. మోడీ రాకపై నల్ల చొక్కా వేసుకొని నిరసన చెబుతున్నట్టు చెప్పారు.ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతోనే మోడీని క్షమించరన్నారు.దేశంలో ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలడానికి మోడీ కారణమన్నారు. బీజేపీకి జనం లేనందున… ఈ సభకు వైసీపీ జనాన్ని సమీకరిస్తోందన్నారు.మోడీ ఏపీ టూర‌్‌ను అన్ని పార్టీలు వ్యతిరేకించాయన్నారు. కానీ, వైసీపీ ఎందుకు నోరు మెదపలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.తాము పార్టీలు మార్చలేదు… పార్టీ కోసం కుటుంబమంతా పోరాటం చేసినట్టు ఆయన గుర్తు చేశారు. గురువుకు పంగనామాలు పెట్టిన వ్యక్తి మోడీ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.మోడీ గో బ్యాక్ అంటూ అనేది ఢిల్లీలో ప్రధాని సీట్లో కూర్చోవడానికి కాదు… గుజరాత్‌ వెళ్లి మీ గ్రామంలో కూర్చోవాలన్నారు.దేశానికి మోడీ దగాకోరుగా మారారని చెప్పారు. మోడీ దేశానికి వాచ్‌మెన్ కాదన్నారు. తనకు ఇష్టమైన వారికి దేశాన్ని దోచిపెడుతున్నారని చెప్పారు. రాఫెల్ కుంభకోణంపై ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలన్నారు. మీరు ఎంత మాట్లాడితే అంత తిప్పి కొడుతానని బాబు చెప్పారు. ఢిల్లీలో పార్లమెంట్ సాక్షిగా మీరు ఇచ్చిన హోదా ఇవ్వరా అని నిలదీస్తానన్నారు. ఇచ్చిన మాట కోసం పోరాటం చేస్తానని చెప్పారు చంద్రబాబు .మొత్తానికి చంద్రబాబు మోడీ ల వార్ పీక్స్ కి చేరింది. నేడు ఢిల్లీ వేదికగా ధర్మ పోరాట దీక్షతో మోడీ పై మరో మారు విరుచుకుపడటానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు.

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article