Changes in 96 movie remake
తమిళంలో ఘన విజయం సాధించిన `96` చిత్రాన్ని తెలుగులో శర్వానంద్, సమంతలతో తెరకెక్కించడానికి దిల్‌రాజు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం కథాపరంగా చర్చలు జరుగుతున్నాయి. తమిళంలో ఉన్న కొన్ని అంశాలను తెలుగులో పూర్తిగా మార్చేస్తున్నారు. ముఖ్యంగా తమిళంలో స్కూల్ డేస్‌లో ఉండే లవ్‌సీన్స్‌ను తెలుగులో కాలేజ్ డేస్‌లో ఉండే లవ్ సీన్స్‌గా మార్చేస్తున్నారట. అలాగైతేనే తెలుగు ఆడియెన్స్‌కు సినిమా కనెక్ట్ అవుతుందని దిల్‌రాజు భావిస్తున్నాడట. ఎమోషన్స్‌ను క్యారీ చేస్తూ ఎలా మార్పులు చేయాలనే చర్చలు జరుగుతున్నాయట. మార్చి నుండి చిత్రీకరణ జరగనుంంది. తమిళ వెర్షన్‌ను డైరెక్ట్ చేసిన సి.ప్రేమ్‌కుమార్.. తెలుగు రీమేక్‌ను డైరెక్ట్ చేస్తున్నారు.