`96` రీమేక్‌లో చేస్తున్న మార్పు ఏంటో తెలుసా!

changes in 96 movie remake in Telugu

త‌మిళంలో విజ‌య్‌సేతుప‌తి, త్రిష న‌టించిన చిత్రం `96`. దిల్‌రాజు నిర్మాణంలో తెలుగులో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. త‌మిళ వెర్ష‌న్‌ను తెర‌కెక్కించిన ప్రేమ్‌కుమార్ తెలుగు వెర్ష‌న్‌ను డైరెక్ట్ చేయ‌బోతున్నాడు. విజ‌య్‌సేతుప‌తి పాత్ర‌లో శ‌ర్వానంద్‌… త్రిష పాత్ర‌లో స‌మంత న‌టించ‌బోతున్నారు. ఫీల్ గుడ్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం మాతృక‌లో సినిమా 20 వెన‌క్కి వెళుతుంది. దాన్ని అనుస‌రించి అప్ప‌టి ప్రేమ‌.. ప్రెజెంట్ సిచ్యువేష‌న్స్‌కు సంబంధించిన ప్రేమ స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించారు. అయితే తెలుగులో అంత లాంగ్ గ్యాప్‌లో ఫ్లాష్ బ్యాక్ ఏపిసోడ్ తీసుకోలేద‌ట‌. పదేళ్ల క్రితంలో ఫ్లాష్ బ్యాక్ ఏపిసోడ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట‌. అంటే ఫ్లాష్ బ్యాక్ పార్ట్ 2009లో ఉండొచ్చు. అప్ప‌టి ఏజ్ గ్రూప్‌కు త‌గ్గ‌ట్లు శ‌ర్వా త‌న లుక్‌ను సుల‌భంగా మార్చుకునే అవ‌కాశం ఉంటుంది క‌దా!.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article