Charan Recommendation for Akhil
రాంచరణ్, అఖిల్ అక్కినేని చాలా మంచి స్నేహితులు. చాలా రోజులుగా మంచి సక్సెస్ కోసం అఖిల్ వెయిట్ చేస్తున్నాడు. రీసెంట్‌గా విడుదలైన మిస్టర్ మజ్ను కూడా అఖిల్‌కు విజయాన్ని అందించలేదు. ఈ తరుణంలో అఖిల్ కోసం ఓ స్టార్ డైరెక్టర్‌ను సినిమా చేయాలని రాంచరణ్ అడిగాడని.. పరిస్థితుల దృష్ట్యా ఆ దర్శకుడు కూడా ఓకే అన్నాడని వార్తలు వినపడుతున్నాయి. ఇంతకు ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు.. సుకుమార్. నిజానికి మహేష్‌తో సుకుమార్ సినిమా చేయాల్సింది. కానీ కథ విషయంలో ఓ క్లారిటీ రాలేదు. ఈలోపు అనిల్ రావిపూడితో సినిమా చేయడానికి మహేష్ సిద్ధమయ్యాడట. కాబట్టి మహేష్ కోసం కథను సిద్ధం చేస్తూనే.. గ్యాప్‌లో అఖిల్‌తో సినిమాను తెరకెక్కించాలని సుకుమార్ భావిస్తున్నాడట. అదీగాక తనకు క్లోజ్ అయిన చరణ్ అడగ్గానే కాదనలేకపోయాడని., అందుకనే అఖిల్‌తో సినిమా చేయడానికి ఓకే అన్నాడని వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై అక్కినేని వర్గం కానీ.. సుకుమార్ వర్గం కానీ ఎలా స్పందిస్తుందో చూడాలి.