ప్రశాంత్‌ కిశోర్‌పై చీటింగ్ కేసు

Cheating Case Against Prashant Kishore

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌పై ఓ యువకుడు కేసు పెట్టాడు. బీహార్‌లో తాను “బాత్‌ బీహార్‌ కీ” పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించి యువతను కలుస్తానని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ఇటీవలే ప్రకటన చేశారు. అయితే తన ఐడియాను కాపీ కొట్టి ప్రశాంత్‌ ఈ కార్యక్రమాన్ని రూపొందించారంటూ ఆయనపై ఓ యువకుడు చీటింగ్ కేసు పెట్టారు. “బాత్‌ బీహార్‌ కీ” కార్యక్రమం తన ఆలోచన అని… ఈ ఐడియాను తన మాజీ సహోద్యోగి ఒసామా ప్రశాంత్‌ కిశోర్‌కు చెప్పాడని మోతీహారీకి చెందిన గౌతమ్‌ అనే యువకుడు ఆరోపించాడు. ఇప్పటికే తాను బీహార్‌ కీ బాత్‌ అనే కార్యక్రమాన్ని ప్రారంభించానని చెప్పాడు. ఇందుకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు ఇచ్చాడు. ప్రశాంత్ కిశోర్‌తో పాటు ఒసామాపై 402, 406 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Cheating Case Against Prashant Kishore,#PrashantKishore,#PK,#CaseAgainstPK,Prashant Kishor of copying his idea,Baat Bihar Ki campaign

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article