అజహరుద్దీన్ పై  చీటింగ్ కేసు

cheating case on Azharuddin

ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ పై  చీటింగ్ కేసు నమోదైంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు చెందిన  ఒక టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ అజారుద్దీన్ పై  తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని ఫిర్యాదు చేసింది. దానిష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏజెంట్ అజహరుద్దీన్ తనకు దాదాపు 20 లక్షల వరకు మోసం చేశాడని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అజారుద్దీన్ పీఏ ముజీబ్ ఖాన్ విజ్ఙప్తి మేరకు అజహరుద్దీన్ అతనికి సంబంధించిన వారికి గత ఏడాది నవంబర్ లో 20 లక్షల విలువ గల ఇంటర్నేషనల్ ఫ్లయిట్ టికెట్లు బుక్ చేశానని ఔరంగాబాద్ లోని డానిష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కు చెందిన ఓనర్ సాహబ్ ఫిర్యాదులో తెలిపాడు.

అయితే ఆ డబ్బులను ఎన్ని సార్లు అడిగినా ఆన్ లైన్ లో పేమెంట్ చేస్తానని చెప్పిన అజహరుద్దీన్ పీఏ ముజీబ్ ఖాన్ ఇప్పటి వరకు చెల్లించలేదని తెలిపారు. ముజీబ్ ఖాన్ సన్నిహితుడు సుదేష్ అవక్కల్ రూ 10.6 లక్షలు ట్రాన్స్ ఫర్ చేసినట్టు మెయిల్ పెట్టాడని…అవి ఇప్పటి వరకు రాలేదన్నారు. నవంబర్ లో  చెక్ ఇస్తున్నట్టు వాట్సాప్ ఫోటోలు పెట్టారని అవి కూడా ఇప్పటి వరకు అందలేదన్నారు. అయితే ఈ వ్యవహారం పై సీరియస్ గా స్పందించారు టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్.. ఇదంతా తప్పుడు ఆరోపణలు అంటూ తోసిపుచ్చిన ఆయన.. వారిపై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

cheating case on Azharuddin ,Ajharuddin , indian cricketer, former captain, chetaing case, maharashtra , danish tours and travels ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *