ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రోడ్ యాక్సిడెంట్లకు చెక్

హైవేల్లో ప్రయాణ భద్రతకోసం దేశవ్యాప్తంగా ఇకపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలోకి రానుంది. ప్రమాదాలను ముందే గుర్తించి డ్రైవర్లను అప్రమత్తం చేసే ఐ – రాస్తే పరిజ్ఞానాన్ని త్వరలో అందుబాటులోకి తేనున్నారు. రోడ్లపై ప్రయాణాలను సురక్షితం చేయనున్నారు. టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఇలాంటి హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధమవుతోంది. ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు నాగ్ పూర్ రవాణా సంస్థలో ఐ – రాస్తేను ఇప్పటికే ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. తెలంగాణాలో కూడా ఆ పద్ధతిని అందుబాటులోకి తేవడానికి సంప్రదింపులు కొనసాగుతున్నాయి.

మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని ఇంటెలిజెంట్ సొల్యూషన్స్ ఫర్ రోడ్ సేఫ్టీ త్రూ టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్ (ఐ – రాస్తే) సంస్థ అందుబాటులోకి తెస్తోన్న ఈ పరిజ్ఞానం వాహనం నడుపుతున్నప్పుడు ప్రమాదానికి కారణమయ్యే పరిస్థితులను పసిగడుతుంది. అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఏడీఏఎస్) సహాయంతో రాబోయే ప్రమాదాల గురించి డ్రైవర్‌లను ముందే హెచ్చరిస్తుంది. మొబిలిటీ అనాలిసిస్, డేటా విశ్లేషణల ద్వారా డేంజర్ స్పాట్స్ ఎక్కడున్నాయి? ఏ ప్రాంతంలో ప్రమాదం పొంచి ఉందనే సమాచారం సేకరించి రోడ్లపై గ్రేస్పాట్లను గుర్తిస్తుంది. తద్వారా అధికారులు నిరంతర పర్యవేక్షణ సాగిస్తూ ప్రమాద నివారణ చర్యలు చేపట్టి అవి ప్రాణాంతక ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లుగా పరిణమించకుండా చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఇంజినీరింగ్ విభాగం అధికారులు ఆయా చోట్ల డిజైన్లను మార్చి ప్రమాదాలను అరికట్టి అవి ప్రాణాంతక బ్లాక్ స్పాట్లుగా మారకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అదే సమయంలో రహదారులపై మెరుగైన మౌళికసదుపాయల కల్పనపై దృష్టి సారిస్తారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article