చర్చికి వెళుతుంటే నీ ప్రవర్తన ఇలాగుండాలి

Check Your Behavior Before Going Church

నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ప్రసంగి 5:1

దేవుని మందిరానికి వెళ్లకపోతే, ఏదైనా కీడు జరుగుతుందేమోననే సెంటిమెంట్ తో వెళ్లొద్దు. పాస్టర్ గారి పోరు, ఇంట్లోబాధ భరించలేక దేవునిమందిరానికి వెళ్లొద్దు దేవుని మందిరానికి వెళ్ళేది మనుష్యులకు కోసం కాదు. దేవుని కోసము కాదు. నీ కోసమే అనే విషయం గ్రహించాలి. సేవకుడు వాక్యాన్ని ప్రకటించడానికి లేచిన వెంటనే, ఆమ్మో! ఈయనా!! ఈయనకసలు వాక్యమే తెలియదు అంటూ మొదటి నిమిషంలోనే ఒక నిర్ణయానికి వచ్చెయ్యొద్దు. ఆయన దేవుని పక్షముగా నిలబడుతున్నారు కాబట్టి, దేవుడే మాట్లాడతారు అని విశ్వసించు.

▪ వాక్యాన్ని ప్రకటిస్తున్న వ్యక్తిని గురించి, మొదట ఈయన బ్రతుకుమార్చుకొని మాకు చెబితే బాగుండు. అనే తలంపు ఎట్టి పరిస్థితిలో రానీయకూడదు. వాక్య విరుద్ధమైన జీవితం ఆయన జీవిస్తుంటే, ప్రార్ధించి, ప్రభువుకు అప్పగించు. అంతే తప్ప  తీర్పు తీర్చే ప్రయత్నం చేయవద్దు. ఎవరి జీవితాలకు వారే ఉత్తరవాదులు. ముఖ్యంగా పాస్టర్ల మీద ఇది ఎక్కువగా ఉంటుంది.

▪ సేవకుడు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆ వాక్యం మీద మాత్రమే దృష్టించు. అంతే కానీ, నీవు బైబిల్ చదువుకొంటూ, సెల్ ఫోన్ తో ఆడుకొంటూ సమయం గడపకూడదు. బైబిల్ చదువుకోవడానికి, సెల్ ఫోన్ తో ఆడుకోవడానికి దేవుడి మందిరానికే నీవు వెళ్లనక్కర్లేదు. ఇంట్లోనే ఆ పని చేయవచ్చు కదా.

▪ ఎవరైనా ప్రార్ధిస్తున్నప్పుడు తప్పనిసరిగా మనసుతో ఏకీభవించాల్సిందే. పాటలు పాడుతున్నప్పుడు, కలసి ప్రభువును స్తుతించాల్సిందే. వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ప్రభువు నీతో ఏమి మాట్లాడబోతున్నారో అత్యాసక్తితో ఆలకించాలని గుర్తుంచుకోండి.

చివరిగా ఒక్కమాట!
కేవలం టైం పాస్ కి మందిరానికి వెళ్లడం..  టైం పాస్ చేసి రావడం కంటే, ఎంచక్కా ఇంట్లోనే ముసుగు వేసుకుని ఇంట్లో పడుకోవడం ఉత్తమం.

– Ranjith Singh Hosanna

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article