హైదరాబాద్ :-హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్ పెట్ కుంట్లూరు రోడ్ లో ఉన్న ప్రజయ్ గుల్మోర్ గ్రేటెడ్ కమ్యూనిటి లో చెడ్డి గ్యాంగ్ కలకలం ప్రజలో ఆందోళన గురిచేస్తుంది.ప్రజయ్ గుల్మోర్ గ్రేటెడ్ కమ్యూనిటి లో వరుసగా నాలుగు ఇండ్లలో చోరీకి యత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.4 ఇళ్ళకి తాళాలు వేసి ఉన్నట్లు రెక్కీ నిర్వహించి చోరీ చేసిన చెడ్డి గ్యాంగ్.విలియంసన్ అనే వ్యక్తి ఇంట్లో 7.5 తులాల బంగారం,80 తులాల వెండి,10వేల నగదు అపహరణ దుండగులు. గ్రేటెడ్ కమ్యూనిటీలో చెడ్డి గ్యాంగ్ సంచరిస్తుండగా సీసీ కెమెరాలు రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.మొత్తం మూడు నెలల చోరీ విఫలయత్నం చేయగా విలియంసన్ అనే వ్యక్తి ఇంట్లో మాత్రం బంగారం నగలు దొంగిలించారు. చోరీ జరిగిన విషయాన్ని బయటకు తెలియకుండా ఉంచిన హయత్ నగర్ పోలీసులు.