బతుకుతానో.. చస్తానో అని భయపడ్డా

142
CheviReddy BaskarReddy About Chandrabaabu
CheviReddy BaskarReddy About Chandrabaabu

CheviReddy BaskarReddy About Chandrababu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. అధికార పక్షానికి, ప్రతిపక్షానికి మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇక నేడు గురువారం అసెంబ్లీలో  చంద్రగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి చంద్రబాబు గత పాలనపై మండిపడ్డారు. గతంలో చెయ్యని తప్పుకు నన్ను సెంట్రల్ జైలుకు పంపారని గుర్తుచేసుకున్నారు చెవిరెడ్డి. బాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుపతి ఆర్డీవో కార్యాలయం ముందు నిరసనకు దిగితే.. సబ్‌ కలెక్టర్‌ చేతికింది ఉద్యోగిని కులం పేరుతో దుషించానని అబద్దపు ప్రచారాలు కల్పించారని అన్నారు. అదేవిధంగా ఇదే శాసనసభలో తాము నల్ల బ్యాడ్జీలు వేసుకొని వస్తే మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారని, టీడీపీ ప్రభుత్వంలో బతుకుతానో..చస్తానో అని తెలియకుండా బతికాను అంటూ భావోద్వేగానికి గురయ్యాడు ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి.

AP POLITICS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here