కిలో చికెన్ 25.. అయినా సరే తినాలంటే భయమే

Chicken Price RS 25 At Yadadri For Coronavirus

కరోనా వైరస్ ప్రభావం మనుషుల మీద ఉన్నా కోళ్ళు తింటే వస్తుందని జరిగిన ప్రచారం ,లంపీ స్కిన్ వ్యాధి , కొక్కెర వ్యాధి కారణంగా కోళ్ళు మృత్యు వాత పడుతున్న తీరు చికెన్ అంటేనే భయపడే పరిస్థితి తీసుకువచ్చింది . గత కొంతకాలంగా తెలంగాణలో చికెన్ వ్యాపారులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కోళ్ళకు  విచిత్రమైన వైరస్ సోకడంతో ఖమ్మం జిల్లాలో లక్షలాది కోళ్లు చనిపోయాయి. ఇక చాలా చోట్ల పౌల్ట్రీ బాగా నష్టపోయింది . చికెన్ తింటే కరోనా వస్తుంది అనే వదంతులు వ్యాపించడంతో చికెన్ ను ముట్టుకోవాలంటే ప్రజలు భయపడిపోయారు. చికెన్ కు దూరంగా ఉంటున్నారు.

దీంతో చికెన్ ధరలు రోజు రోజుకు తగ్గిపోవడం మొదలుపెట్టాయి. దీంతో చికెన్ వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు.  చికెన్ తింటే కరోనా రాదనీ చెప్పి ఇటీవలే హైదరాబాద్ లో చికెన్ మేళా నిర్వహించారు.  అయినా సరే ప్రజలు వాటిజోలికి వెళ్లేందుకు ఆలోచిస్తున్నారు.  యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్ కు చెందిన ఓ చికెన్ షాప్ యజమాని వినూత్నంగా ఆలోచించాడు.  రూ. 100కు నాలుగు కేజీల బరువున్న రెండు కోళ్లు ఇస్తామని ప్రకటించారు.  అంటే కిలో రూ. 25 కి చికెన్ వస్తుందన్నమాట.  దీంతో జనాలు ఆ షాపు ముందు క్యూ కట్టారు.  లాభం రాకపోయినా పర్వాలేదు కానీ  నష్టం తెచ్చుకోవడం కంటే ఉన్నది ఇలా అమ్ముకోవడం బెస్ట్ అని అంటున్నాడు ఈ వ్యాపారి. ఇంత తక్కువకు చికెన్ ఇచ్చినా డేర్ చేసే వాళ్ళు చాలా తక్కువ మండే అని చెప్పాలి . ఏది ఏమైనా ఇంకా జనాల్లో కోళ్ళు తింటే కరోనా వస్తుంది అన్న భయం పోవటం లేదు. దీంతో చికెన్ తినాలంటేనే భయపడుతున్నారు.

Chicken Price RS 25 At Yadadri For Coronavirus,chicken , hen , corona virus ,lampy skin desease , kokkera desease, poultry , chicken rates

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article