బుద్ధదేవ్ భట్టాచార్య మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సిపిఎం మాజీ పొలిట్ బ్యూరో సభ్యుడు బుద్ధదేవ్ భట్టాచార్య మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.
బుద్ధదేవ్ 11 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా, అయిదున్నర దశాబ్దాలు ప్రజా జీవితంలో బెంగాల్‌కు సేవలు అందించారని, నీతి,నిజాయితీలకు నిలువుటద్దంగా నిలిచారని ముఖ్యమంత్రి కొనియాడారు. బుద్ధదేవ్ భట్టాచార్య కుటుంబ సభ్యులు, సిపిఎం శ్రేణులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుభూతి తెలియజేశారు.