బాల కార్మికుల కేసుల్లో తెలంగాణ టాప్

33
Child labour crimes in Telengana
Child labour crimes in Telengana

Child labour crimes in Telengana

తెలంగాణ రాష్ర్టం అన్ని రంగాల్లో ముందుకెళ్తుందని, దేశంలోనే డైనమిక్ సిటీగా తీర్చిదిద్దుతామని చెప్తున్న నాయకులు మాటల ఆచరణకు నోచుకోవడం లేదు. సంక్షేమ పథకాలు ఎన్ని ప్రవేశపెట్టినా అర్హులకు అందడం లేదు. అందుకోసం కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదు. రాష్ర్టంలో బాలకార్మికుల కేసులు భారీగా పెరుగుతున్నాయి. బాల కార్మికుల కేసుల్లో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నట్లు జాతీయ నేరాల నమోదు సంస్థ నివేదక వెల్లడించింది.

2019లో దేశవ్యాప్తంగా బలకార్మిక నిరోధక చట్టం కింద 770 కేసులు నమోదు అయితే, ఒక్క తెలంగాణలోనే 314 నమోదయ్యయాయి. అంటే దేశంలో ఎక్కడాలేని కేసులు తెలంగాణలోనే నమోదవుతున్నాయి. రాష్ర్టంలో బాలికలపై లైంగిక వేధింపలు పెరుగుతున్నాయి. 2011 బాలికలు వేధింపులు గురైనట్లు ఫోక్సో చట్టం కింద పోలీసులు గుర్తించారు. ఇప్పటికైనా పిల్లల రక్షణకు కఠిన చట్టాలు రూపొందించాలని బాలల హక్కుల నేతలు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here