children are in critical position
ఆస్పత్రుల్లో నిర్లక్ష్యం ప్రజల ప్రాణాల మీదకు తెస్తుంది. వైద్య సిబ్బంది చేసిన పని ఇటీవల 15 మంది చిన్నారులను ఆస్పత్రి పాలు చేసింది. నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్ లోని వైద్యుల మరియు సిబ్బంది నిర్వాకం 15 మంది చిన్నారులకు ప్రాణం మీదికి తెచ్చింది. వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత వారికి నొప్పి రాకుండా ఉండడానికి, అలాగే వ్యాక్సినేషన్ తర్వాత వచ్చే జ్వరం తగ్గడానికి పారాసిటామాల్ టాబ్లెట్ ఇస్తారు. అయితే పారాసిటామాల్ కి బదులుగా ట్రెమడాల్ టాబ్లెట్ ఇవ్వడంతోనే చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో వైద్య సిబ్బంది చేసిన పొరపాటు తో 15 మంది చిన్నారులు అస్వస్థతతో నీలోఫర్ ఆస్పత్రిలో ఉన్నారు. వీరిలో ఒక్క చిన్నారి మృతి చెందారు. అస్వస్థతకు గురైన చిన్నారులు నీలోఫర్తో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో గురువారం నాడు 90 మంది చిన్నారులకు వ్యాక్సిన్ వేశారు. వ్యాక్సిన్ వేసుకొన్న చిన్నారులకు నొప్పి రాకుండా ఉండేందుకు గాను ప్యారాసిటమల్ మందు బిళ్లలను ఇస్తారు. అయితే ప్యారాసిటమల్కు బదులుగా ట్రామడల్ మందు బిళ్లలను చిన్నారులకు నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బంది ఇచ్చారు. ఈ మందు బిళ్లల కారణంగానే చిన్నారులు అస్వస్థతకు గురైనట్టుగా నీలోఫర్ వైద్యులు నిర్ధారించారు. అయితే బుధవారం నాడు నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో వ్యాక్సిన్ తీసుకొన్న చిన్నారులు ఎక్కడెక్కడ ఉన్నారు, వారి ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయమై వైద్యులు ఆరా తీస్తున్నారు.
Latest Interesting Telugu News Tsnews
For More New