టీడీపీకి షాక్ ఇచ్చి జనసేనలో చేరిన చినరాజప్ప సోదరుడు

Chinarajapa Brother Joined in Janenna shock for TDP

ఏపీలో ఎన్నిక‌లు ముంచుకొస్తున్న సమ‌యంలో అధికార టీడీపీకి వ‌రుస షాక్‌లు త‌గులుతున్నాయి. ఇప్ప‌టికే పార్టీ నుండి ప‌లువురు నేత‌లు వ‌ల‌స‌బాట ప‌డుతున్నారు. కొద్ది రోజుల క్రితం గుంటూరు సిట్టింగ్ ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి జ‌న‌సేన‌లో చేర‌గా.. ఇటీవ‌ల రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మ‌ల్లికార్జున రెడ్డి కూడా టీడీపీకి గుడ్ బై చెప్పేసి వైసీపీలో చేరారు. ఇక బుద్దా వెంకన్న సోదరుడు బుద్దా నాగేశ్వర్ రావు సైతం వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు .
అయితే ఇప్పుడు ఏకంగా ఏపీ డిప్యూటీ సీయం, హోంమంత్రి నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప సోద‌రుడు ల‌క్ష్మ‌ణ్ జ‌న‌సేన‌లో చేర‌డం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీలో కీల‌క సీనియ‌ర్ నేత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న చిన‌రాజ‌ప్ప రాజ‌కీయాల్లో క్ర‌మ‌శిక్ష‌ణ క‌ల్గిన నాయ‌కుడిగా పేరుగాంచారు. అయితే ఇప్పుడు మూడు నెల‌ల్లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జరుగ‌నున్న నేప‌ధ్యంలో సొంత సోద‌రుడే చిన‌రాజ‌ప్ప‌కు ఝ‌ల‌క్ ఇవ్వ‌డంతో టీడీపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీంతో ఇప్ప‌టికే ఎన్నిక‌ల వేళ టీడీపీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు మ‌రో షాక్ త‌గిలింద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article