అన్న చాటు తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కథానాయకుడు పవన్‌కల్యాణ్. తనకి నటనపై అంతగా ఆసక్తి లేదని చెప్పినా…వదిన సురేఖ,అన్న చిరంజీవి ప్రోద్భలంతో ట్రైనింగ్ తీసుకుని హీరోగా ఎంట్రీ ఇచ్చాడు పవన్‌కల్యాణ్.ఆ తర్వాత ఒకొక్క సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్‌ని సృష్టించుకుని స్టార్‌గా ఎదిగాడు.ఆ తర్వాత పవన్ అంటే ఓ ప్రభంజనంలా మారిపోయింది.దేశంలోనే కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ఒకడిగా పవన్‌కల్యాణ్‌కి పేరుంది.ఈ విషయం గురించి చిరంజీవి ఇటీవల స్వయంగా మాట్లాడుతూ అందరి హీరోలకీ అభిమానులుంటే మా తమ్ముడికి భక్తులు ఉన్నారని చెప్పారంటే పవన్ మేనియా ఏ రేంజ్‌లో సాగుతోందో అర్థం చేసుకోవచ్చు.తనకంటూ అంత ఫాలోయింగ్ ఉన్నప్పటికీ అన్న చిరంజీవి అంటే పవన్‌కి ప్రాణం.తన తండ్రి సమానులు, గురు సమానులు అని చెబుతుంటారు.ఆయన లేకపోతే నేను లేను అన్నట్టుగా మాట్లాడుతుంటారు.అలాంటిది ఇప్పుడు వాళ్లిద్దరి గురించి ఓ ఆసక్తికరమైన వార్త ప్రచారంలో ఉంది.
`భోళాశంకర్` సినిమాలో చిరంజీవి తన తమ్ముడు పవన్‌కల్యాణ్ అభిమానిగా కనిపిస్తాడనేది ఆ వార్త.అందులో నిజమెంతన్నది తేలాల్సి ఉంది. అయితే ఈ సినిమా గురించే మరో ఆసక్తికరమైన వార్త ప్రచారంలో ఉంది.పవన్‌కల్యాణ్ ఖుషి సినిమాలోని బొడ్డు సీన్‌ని భోళాశంకర్‌లో చిరంజీవి చేసినట్టు సమాచారం. ఖుషిలో ఆ సీన్ పవన్‌కీ – భూమికకీ మధ్య తెరకెక్కించగా, భోళాశంకర్ సినిమాలో చిరంజీవికీ, యాంకర్ శ్రీముఖికీ మధ్య సాగుతుందని సమాచారం. కామెడీ సీన్స్‌లో భాగంగానే ఈ సన్నివేశాలు తెరకెక్కించినట్టు తెలుస్తోంది.