రేపు జగన్ తో భేటీ కానున్న చిరంజీవి, రాం చరణ్

168
Chiranjeevi and Ram Charan to meet jagan on tomorrow
Chiranjeevi and Ram Charan to meet jagan on tomorrow
Chiranjeevi and Ram Charan to meet jagan on tomorrow

మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జగన్ ను కలవనున్నారు. ఇది రాజకీయమా లేకా వ్యక్తిగతమా అన్న చెచ జోరుగా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. చిరంజీవి నటించిన సైరా సినిమా టాలీవుడ్లో మంచి విజయం సాధించింది.  మిగతా భాషల్లో పెద్దగా హిట్ కాలేకపోయినా తెలుగులో మాత్రం ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు.  మెగాస్టార్ నటనను ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు.  అంతేకాదు , టాలీవుడ్ కు చెందిన సినీ ప్రముఖులు సినిమాను చూసి మెచ్చుకుంటూ ఇప్పటికే ట్వీట్ చేస్తూ వచ్చారు.  తెలంగాణ గవర్నర్ కూడా ఈ సినిమాను చూసి బాగుందని మెచ్చుకున్నారు.
ఇదిలా ఉంటె, రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను మెగాస్టార్ చిరంజీవి కలవబోతున్నారు.  మెగాస్టార్ కు వైఎస్ జగన్ అపాయింట్మెంట్  ఇచ్చినట్టు తెలుస్తోంది.  సైరా హీరో మెగాస్టార్ చిరంజీవి, నటుడు, నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డిలు వైఎస్ జగన్ ను కలవబోతున్నారు.  సైరా సినిమాకు సంబంధించిన విషయాల గురించి ముఖ్యమంత్రితో చర్చించబోతున్నట్టు తెలుస్తోంది.  ఇందులో రాజకీయ కారణాలు లేవని చెప్తున్నా ఇంకేదో ఉంది అని రాజకీయ వర్గాలు వీరి భేటీపై లుక్కేశాయి.

tags :  mega star, chiranjeevi, ap cm, jagan, meet, ram charan, saira,

ఆర్టీసీ కార్మికులు సరెండర్ కావాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here