Chiranjeevi Sensational Comments on AIRPORT
శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది .టెక్నాలజీని వీలైనంత త్వరగా ఇంప్లిమెంట్ చేసుకోవడంలో ఈ ఎయిర్ పోర్ట్ దూసుకుపోతోంది. ఇప్పటివరకూ ఈ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులను తనిఖీ చేయడం అన్నది పెద్ద తలనొప్పి వ్యవహారం. అంతే కాకుండా ఇక్కడ ప్రతినిత్యం నకిలీ వీసాల ద్వారా వెళ్ళే వాళ్ళను పట్టుకోవటం పెద్ద టాస్క్ . ఇక తనిఖీల కోసం అందరూ గంటల తరబడి క్యూలో ఎదురుచూడాల్సి వచ్చేది. బోర్డింగ్ పాస్, ఐడీ కార్డు, పాస్ పోర్ట్ అన్నీ ఉన్నా… టైమ్ వేస్ట్ అయ్యేది. విమానం ఎక్కే ముందు జరిగే ఈ చెకింగ్ ప్రాసెస్ కోసం పనిగట్టుకొని… రెండు గంటలు ముందే ఎయిర్‌పోర్ట్‌కి రావాల్సిన పరిస్థితి. ఇకపై బోర్డింగ్ పాస్ అవసరం లేదు. దాని బదులుగా కొత్త టెక్నాలజీ తెస్తున్నారు. డిజిటల్ యాత్ర కార్యక్రమంలో భాగంగా… ఫేస్ రికగ్నిషన్ సిస్టం (ముఖాన్ని గుర్తించే పరికరాల వ్యవస్థ)ను తీసుకొస్తున్నారు. దేశంలోనే ఈ సిస్టం వస్తున్న తొలి ఎయిర్పోర్ట్ ఇదే.
ప్రయాణికులు ఏం చేయాలంటే : ప్రయాణికులు ముందుగా డీజీ యాత్ర ఐడీ ప్రోగ్రామ్ ద్వారా తమను తాము రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ ప్రోగ్రాంలోని కెమెరా… ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ కౌంటర్ల ద్వారా వెళ్లే సమయంలో ప్రయాణికుల ఫేస్‌ని గుర్తుపడుతుంది. వెంటనే లోపలికి అనుమతిస్తుంది. అందువల్ల బోర్డింగ్ పాస్ చూపించాల్సిన అవసరం లేదు. మొదటిసారి మాత్రమే ఫేస్ వెరిఫికేషన్ నమోదు ప్రక్రియ ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడు ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లినా… ఆటోమేటిక్‌గా ఫేస్ వెరిఫికేషన్ జరిగిపోతుంది. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ ప్రక్రియ బాగుందని మెచ్చుకున్నారు.
Face Recolonization software in Samshabad Airport