‘మెగా సూప‌ర్’ లుక్

42

పాత్ర డిమాండ్ చేస్తే హీరోలు ఎంత రిస్క్ చేయ‌డానికి వెనుకాడ‌టం లేదు. సినిమా కోసం ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ అవుతుంటారు. తాజాగా మెగాస్టార్ ఓ మూవీ కోసం, సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు ‘స‌ర్కారు వారి పాట’ కోసం లుక్స్ మార్చేశారు. ఆచార్య విష‌యానికొస్తే… చిరంజీవి తాజా లుక్ టెస్ట్ కోసం గుండుబాస్‌గా మారారు. అయితే ఈ లుక్ ఆచార్య కోసం ఫిక్స‌యిందా… వేరే సినిమా కోసం ఇలా మారారా? అనే విష‌యాలేవీ తెలియ‌వు. గుండు గెట‌ప్‌తో చిరు త‌న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. అర్బ‌న్ మాంక్ అంటూ… క్యాప్ష‌న్ ఇచ్చాడు.

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు కూడా త‌న లుక్‌ను పూర్తిగా మార్చేశాడు. స‌ర్కార్ వారి పాట‌లో పూర్తిగా కొత్త‌గా క‌నిపించ‌నున్నాడు. ఇందుకోసం మ‌హేశ్ త‌న జుట్ట‌ను బాగా పెంచుతున్నాడు. కొత్త లుక్‌లో భాగంగా ఒక ఫొటో బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో ఆయ‌న ఫ్యాన్స్ ‘భ‌లే ఉన్నావ్ బాబు….’ అంటూ మురిసిపోతున్నారు. ఇప్పుడు చిరంజీవి, మ‌హేశ్ ఫొటోలు వైర‌ల్ గా మారి సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here