పవన్ తప్పునే చిరంజీవి రిపీట్ చేస్తున్నాడా..?

34
chiru new movie
chiru new movie

chiru new movie

ఖైదీ నెంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి దూకుడు చూపిస్తారు అనుకున్నారు. కానీ ఆయన మాత్రం తీరిగ్గా సినిమాలు చేస్తున్నాడు. కాకపోతే పదిహేనేళ్ల క్రితం తను కల కన్న సైరా నరసింహారెడ్డిని ఫినిష్ చేసి మెప్పించాడు. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో ‘ఆచార్య’చేస్తున్నాడు. రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోన్న ఈ మూవీలో మెగాస్టార్ సరసన మరోసారి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయిన ఆచార్య ఇప్పటి వరకూ 30శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే రీ ఎంట్రీ తర్వాత మూడు సినిమాలకూ రామ్ చరణే నిర్మాతగా ఉన్నాడు. తర్వాత అందరూ అల్లు అరవింద్ తో సినిమా చేస్తాడు అనుకున్నారు. అలాగే కెఎస్ రామారావు కూడా చిరంజీవి డేట్స్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ టైమ్ లో అనూహ్యంగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ మెగా డేట్స్ ను సంపాదించుకోవడం విశేషం. యస్.. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించే సినిమాతో మెగాస్టార్ రామ్ చరణ్ ప్రొడక్షన్ కాంపౌండ్ ను దాటబోతున్నాడు. అయితే ఈ బ్యానర్ లో చేసే మూవీ విషయంలో చిరంజీవి మరో రాంగ్ స్టెప్ వేస్తున్నాడు అనేది అంతా అనుకుంటోన్న మాట. ఆచార్య తర్వాత చిరంజీవి మళయాల హిట్ మూవీ లూసీఫర్ ను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాడు.

నిజానికి ఈ నిర్ణయం అంత మంచిదేం కాదు. ఆల్రెడీ ఈ మూవీ తెలుగులో డబ్ అయి ఉండటమే అందుకు కారణం. సుజిత్ డైరెక్ట్ చేస్తాడు అనే మాటలు వినిపించిన ఈ మూవీ తర్వాత లేదంటే ముందుగానే ఏకే బ్యానర్ లో మరో సినిమా చేయబోతున్నాడు చిరంజీవి. అదే మరో రాంగ్ స్టెప్ అంటున్నారు. ఎందుకంటే ఏకే బ్యానర్లో చేసే సినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయిన వేదాళం కు రీమేక్. అజిత్, నయనతార జంటగా నటించిన ఈ మూవీ కూడా తెలుగులో డబ్ అయింది. అజిత్ కు మన దగ్గర పెద్దగా మార్కెట్ లేకపోవడం వల్ల ఎక్కువగా తెలియలేదు. కానీ టివిల్లో ఈ మూవీకి మంచి ఆదరణే ఉంది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఆల్రెడీ చూశారన్నమాటే కదా. మరి అలాంటి మూవీని మళ్లీ రీమేక్ చేయాలనుకోవడం వెనక ఏ వ్యూహాలు ఉన్నాయో కానీ.. ఇలాగే గతంలో పవన్ కళ్యాణ్ కూడా అదే అజిత్ హీరోగా నటించిన వీరమ్ సినిమాను తెలుగులో కాటమరాయుడుగా రీమేక్ చేశాడు. కానీ ఆ సినిమా కూడా తెలుగులో డబ్ అయ్యిందే. అందుకే కాటమరాయుడు ఒరిజినల్ మ్యాజిక్ ను తెలుగులో రిపీట్ చేయలేదు. మరి అలాంటి మిస్టేక్ నే ఇప్పుడు చిరంజీవి కూడా చేయబోతున్నాడనేది విశ్లేషకుల అంచనా..

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here