CHOREOGRAPHER AS A DIRECTOR
కొరియోగ్రాఫర్‌లందరరూ దర్శకులుగా మారడం ఎప్పటి నుండో జరుగుతుంది. ప్రభుదేవా, లారెన్స్, గణేష్ ఆచార్య, రెమో డిసౌజా, ఫరాఖాన్, అమ్మ రాజశేఖర్ … ఇలా చాలా మంది కొరియోగ్రాఫర్స్ మెగాఫోన్ పట్టినవాళ్లే. ఈ లిస్టులో మరో కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ చేరబోతున్నారు. పలు అగ్ర హీరోల పాటలను కొరియోగ్రఫీ అందించిన ఈ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఇప్పుడు మెగాఫోన్ పట్టడానికి కథను సిద్ధం చేశాడట. హీరోలు, నిర్మాతలతో చర్చలు జరుపుతున్నారనేది సమాచారం. త్వరలోనే ఈ విషయం మీద ఓ క్లారిటీ రానుంది.