అందంగా ముస్తాబైన చర్చ్ లు

Churches Beautiful decorated for good Friday  గుడ్ ఫ్రైడే వేడుకలు ..

గుడ్‌ ప్రైడేకు హైదరాబాద్‌లోని చర్చిలు అందంగా ముస్తాబయ్యాయి. ఒక్క హైదరాబద్ లోనే కాకుండా రాష్ర వ్యాప్తంగా విద్యుత్‌ దీపాలతో చర్చిలు వెలిగిపోతున్నాయి. హైదరాబాద్‌లోని కల్వరి టెంపుల్‌ చర్చి అందంగా ముస్తాబయ్యింది. ఇక్కడ జరిగే గుడ్‌ ప్రైడే వేడుకలకు తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి క్రైస్తవులు తరలిరానున్నారు. యేసు మరణించిన రోజును గుడ్‌ ప్రైడేగా క్రిస్టియన్లు జరుపుకుంటారు. క్రైస్తవులంతా ఈ రోజున భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేస్తారు. లోకరక్షణ కొరకు యేసు మరణించాడని… అందరూ ఉపవాసాలతో చర్చిలకు వెళ్తారు.

గుడ్ ఫ్రైడే రోజున క్రైస్తవ ధర్మాన్ని పాటించేవారు చర్చిలకు వెళ్ళి యేసు ప్రభువును ఇలా ప్రార్థిస్తారు. క్రీస్తు జననం(క్రిస్మస్) పండుగ తర్వాత క్రీస్తు పేరిట ప్రార్థనలు, ప్రాయశ్చిత్తం, ఉపవాసాలను పాటిస్తారు. ఈ సమయాన్నే “ఈస్ట్ వెడ్నెస్‌డే” నుంచి ప్రారంభమౌతుంది. ఇది గుడ్ ఫ్రైడే రోజుకు పరిసమాప్తమౌతుంది. దీనినే లెంట్ అని అంటారు. ఇదే రోజున క్రీస్తును శిలువ చేశారు. దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం క్రైస్తవ ధర్మాన్ని పాటించేవారు కొయ్యతో చేసిన శిలువను చర్చిలలో ఉంచి ప్రార్థిస్తారు. ప్రతి ఒక క్రిస్టియన్ వచ్చి ఆ శిలువను ముద్దాడుతారు.

ఆ తర్వాత మధ్యాహ్నంనుంచి మూడు గంటలవరకు సేవలుంటాయి. ఈ సేవలలో క్రీస్తు సిద్ధాంతాల(నాలుగు గోస్పెల్స్)లోంచి ఏదో ఒక దానిని చదివి భక్తులకు వినిపించి వారిచేతకూడా చదివిస్తారు. ఆ తర్వాత చర్చిలలో ప్రవచనాలు, ధ్యానం మరియు ప్రార్థనలు జరుగుతాయి. ఈ సందర్భంగా క్రీస్తును ఎలా శిలువ చేసేరనేదానిపై మత పెద్దలు ఉపన్యాసం చేసి క్రీస్తును స్మరించుకుంటారు. దీని తర్వాత అర్థరాత్రికి సాధారణ కమ్యూనియన్ సర్వీస్ ఉంటుంది. అంటే సామూహిక ప్రార్థనలలో క్రీస్తు స్మృతిపథాన్ని గుర్తు చేసుకుంటారు.
కొన్ని చోట్ల నల్లటి వస్త్రాలు ధరించి భక్తులు క్రీస్తును స్మరిస్తూ ఒక సమారోహాన్ని ఏర్పాటు చేస్తారు. చివరికి కృత్రిమ అంతిమ సంస్కారం కూడా చేస్తారు.

క్రైస్తవ ధర్మాన్ని పాటించేవారు గుడ్ ఫ్రైడే రోజున ప్రాయశ్చిత్తం, ప్రార్థనలు చేసుకునే రోజు. ముఖ్యంగా ఈ రోజు చర్చిలలో గంటలు మ్రోగవు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article