సికింద్రాబాద్: రైల్వే ఉద్యోగి సురేష్ కుమార్ ఇంట్లో సి.బి.ఐ అధికారులు దాడులు జరిపారు. నాచారం లోని కాంక్రీట్ ప్లాజా అపార్ట్మెంట్ 405 బి బ్లాక్ లో సురేష్ కుమార్ ఇంట్లో దాడులు జరిగాయి. సురేష్ కుమార్ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ లో విధులు నిర్వహిస్తున్నారు. 10 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పదిహేను మంది సభ్యుల బృందం సురేష్ కుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించింది.