చంద్రబాబుకు సీఐడీ నోటీసులు

మున్సిపల్ ఎన్నికల్లో ఓటమితో కుదేలైన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ సీఐడీ షాక్ ఇచ్చింది. అమరావతి భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో ఆయనకు నోటీసులు జారీచేసింది. సీఆర్పీసీ 41 కింద బాబుకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆయనకు నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. ఈనెల 23న విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. ఇదే కేసులో మాజీ మంత్రి నారాయణకు కూడా సీఐడీ నోటీసులిచ్చింది. దాదాపు 500 ఎకరాల అసైన్డ్ భూముల బదలాయింపునకు సంబంధించి చంద్రబాబుపై అధికారులు కేసు నమోదు చేశారు. కేబినెట్ ఆమోదం లేకుండానే ఈ భూములను ల్యాండ్ పూలింగ్ లో చేర్చడానికి జీవో ఇచ్చారని అభియోగాలు మోపారు. దళితులకు కేటాయించిన ఈ భూములను రాజధాని ప్రకటనకు ముందు కొనుగోలు చేశారని, ఆ తర్వాత అసైన్డ్ భూముల కొనుగోళ్లను వన్ టైం సెటిల్ మెంట్ లో క్రమబద్ధీకరణ చేయడానికి అనుమతించారనే ఆరోపణలున్నాయి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article