ఉచ్చు బిగుస్తుందా?

122
cbn ultimatum to jagan
cbn ultimatum to jagan

CID writes to I-T dept about Amaravati Lands

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసిన వారి విషయంలో  ఏపీ సీఐడీ దూకుడుగా ముందుకెళ్తూ అక్రమాలను తవ్వి తీస్తోంది. తాజాగా అమరావతి ప్రాంతంలో 2018-2019వరకు భూములు కొనుగోలు చేసిన వారి వివరాలను ఐటీకి అందజేసి టీడీపీ నేతల గుండెల్లో సీఐడీ రైళ్లు పరిగెత్తిస్తోంది. దీంతో ఐటీ రంగంలోకి దిగుతుందన్న సంకేతాలు వస్తున్నాయి. అమరావతిలో ఐటీ చట్టాలను ఉల్లంఘించి భూములు కొనుగోల్ మాల్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఐటీ చీఫ్ కమిషనర్ కు సీఐడీ అడిషనల్ డైరెక్టర్ సునీల్ కుమార్ తాజాగా లేఖ రాయడం సంచలనంగా మారింది. ఈ లేఖలో 106మంది టీడీపీ నేతల పేర్లు ఉన్నట్టు సమాచారం. దీంతో టీడీపీ శిబిరంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటికే మాజీ మంత్రులు ప్రత్తిపాటి నారాయణలతోపాటు మరికొందరిపై ఏపీ ప్రభుత్వం కేసులు పెట్టి దర్యాప్తు చేస్తోంది. తాజాగా మరో ఐదుగురిపై కేసు నమోదు చేసింది. ఇప్పుడు 106మంది టీడీపీ నేతలపై కేంద్ర ఐటీ శాఖకు లేఖ రాయడంతో టీడీపీ శిబిరం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

CID writes to I-T dept about Amaravati Lands,Amaravati, insider trading , AP CID , IT , TDP

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here