వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సినీ కార్మికులు ఆందోళన

హైదరాబాద్: వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సినీ కార్మికులు కదంతొక్కారు. జూబ్లీహిల్స్ పరిధిలోని వెంకటగిరిలో ఉన్న ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. వివిధ యూనియన్లకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని నిరసన తెలిపారు. నాలుగేళ్లుగా పెంచాల్సిన వేతనాలు పెంచడం లేదని.. చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్మికులు చెప్పారు. ఇంటి అద్దెలు, నిత్యావసర ధరలు బాగా పెరిగిపోయాయన్నారు. పిల్లల స్కూల్ ఫీజులు కూడా కట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు పెంచాల్సిందేనంటూ కార్మికులు నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కార్మికులు అక్కడికి చేరుకోవడంతో భారీగా పోలీసులు మోహరించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article