కోవిడ్ -19, సినిమా -20  తెర వెనక కష్టాలు

50
cinema problems
cinema problems

cinema problems

కంటికి కనిపించని ఓ చిన్న వైరస్ .. ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ప్రతి మనిషి లైఫ్ స్టైల్లో అనేక మార్పులు తెచ్చింది. ఈ మార్పులకు కారణం కరోనానే అయినా సాధారణ జీవితాలను మాత్రం తలకిందులు చేసింది. అలా ఎంటర్టైన్మెంట్ రంగాన్ని మాత్రం కోలుకోలేని దెబ్బ తీసింది కరోనా. ఈ వైరస్ దెబ్బకు అన్ని సినిమా పరిశ్రమలూ విలవిలలాడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇన్నేసి సినిమాలు కూడా నిర్మాణం కావు అనేంతగా ఫిల్మ్ ఇండస్ట్రీ దెబ్బతిన్నది. అయితే తెలుగులో ఈ మార్పులు చూస్తే.. స్టార్స్ గా ఉన్నవాళ్లు.. స్టార్డమ్ తెచ్చుకున్నవాళ్లకు ఇబ్బంది లేదు. అంటే కేవలం నటుల్లోనే కాదు.. ఇతరత్రా వర్క్స్ లో ఉన్నవారికి కూడా ఇది వర్తిస్తుంది. అయితే తెర వెనక కష్టపడేవారికి మాత్రం కరోనా ఎఫెక్ట్ మామూలుగా లేదు.
కరోనా క్రైసిస్ ఛారిటీ అంటూ రెండునెలలుగా ఇండస్ట్రీలో కార్డ్ ఉన్నవాళ్లను పరిశ్రమ ఆదుకుంటోంది. అయితే తెరవెనక టెక్నీషియన్స్ గా పనిచేసేవారి బ్రతుకులు మాత్రం రోడ్డున పడ్డాయి. వారిలో చాలామంది కేవలం రోజువారీ పనినినమ్ముకునే బ్రతుకుతున్నారు. ఇండస్ట్రీ పచ్చగా ఉన్నన్నాళ్లూ వీరికి పని దొరికింది. రోజూ ఆ రంగలు ప్రపంచంలో తాము ఓ రంగు కాకపోయినా.. ఆ రంగుల వెనక హంగుల్లో భాగమైనందుకు ఆనందంగా ఉండేవారు. కానీ ఇప్పుడు వీరి జీవితం తలకిందులైంది.

చాలామంది సొంత ఊరికి వెళ్లలేక.. హైదరాబాద్ లో ఉండలేక నరకం అనుభవిస్తున్నారు. అలాగే ఊరికి వెళ్లినవాళ్లలో చాలామంది రోజువారీ కూలీలుగా మారారు. ఒకప్పుడు ‘ఒరేయ్ ఇవాళ చిరంజీవి గారితో షూటింగ్ లో ఉన్నాను.. మహేష్ బాబు షూటింగ్ లో ఉన్నాం’అని ఊరి వారికి గర్వంగా చెప్పిన చోటే.. నిర్వేదంగా పనికి వెళుతున్నారు. ఇంకొందరు కుల వృత్తుల్లో పడిపోయారు. ఇలా ఎంతోమంది తెర వెనక పనిచేసే కార్మికుల జీవితాలకు సినిమా పరిశ్రమ పెద్దగా భరోసా ఇవ్వలేకపోయింది అనేది నిజం. వీరిని ఆదుకునేందుకు ఏ పెద్ద నిర్మాణ సంస్థా ముందుకు రాదు. కేవలం వారితో పని ఉన్నంత కాలం మాత్రమే పైన పెట్టుకుంటారు. ఇంకా చెబితే పని ఉన్న టైమ్ లో కూడా కొన్ని పేరున్న నిర్మాణ సంస్థలు వీరికి ఒప్పందం చేసుకున్న డబ్బులు ఇవ్వడానికి కూడా రోజుల తరబడి తిప్పుతాయి అనేదీ తెలియంది కాదు. మొత్తంగా కోవిడ్ -19 తో ఈ 2020లో సినిమా రంగం కుదేలైపోయింది. అందులో తెర వెనక పనిచేసే వారి బ్రతులకు మరింత దుర్భరంగా మారాయి. మరి ఈ రోజులు పోయి.. మళ్లీ మంచి రోజులు త్వరగా రావాలని కోరుకోవడం తప్ప మనమేం చేయలేం కదా.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here