కోవిడ్ -19,  సినిమా -20

48
telugu cinema
telugu cinema

Cinema problems

2020 మార్చి 15 … అప్పటి వరకూ ఇండియన్ సినిమా హ్యాపీగా ఉంది. విడుదలైన సినిమాల రివ్యూలు.. కాబోతోన్న సినిమాల అంచనాలతో ఆనందంగా ఉంది. కానీ ఆ తర్వాతి వారానికే సిట్యుయేషన్ మారింది. బ్లాక్ బస్టర్ బొమ్మ ఫస్ట్ వీక్ లోనే థియేటర్స్ నుంచి తీసేసినంత షాకింగ్ గా ఒక్కసారిగా కరోనా దేశవ్యాప్తంగా వ్యాపించింది. జనతా బంద్ నుంచి మొదలై లాక్ డౌన్ కు కేవలం 24 గంటల వ్యవధిలోనే పరిస్థితి తారుమారైపోయింది. ముఖ్యంగా ఆ నెల 25న కొన్ని సినిమాలు విడుదల కావాలి. అలాగే ఏప్రిల్ 2న మరికొన్ని సినిమాలు అంటూ లెక్కలు వేసుకున్న టాలీవుడ్ కు ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. అప్పటి నుంచి మొదలై ఎప్పుడు ఫ్రీ అవుతుందో చెప్పలేని పరిస్థితికి చేరింది ఇండస్ట్రీ. సాధారణంగా ఈ లాక్ డౌన్ కాలంలో అన్ని పరిశ్రమలూ ఇబ్బంది పడ్డాయి. అయితే నిత్యం కలర్ ఫుల్ గా సందడి సందడిగా కనిపించేది కేవలం సినిమా పరిశ్రమ మాత్రమే. దీంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో చీకటి ఆవరించింది. కార్మికుల బ్రతుకులు రోడ్డున పడ్డాయి. స్టార్స్ అంతా ఇంటికే పరిమితం అయ్యారు. నిర్మాతలు తెచ్చిన అప్పుల లెక్కలు.. వాటికి కట్టాల్సిన వడ్డీల లెక్కలు వేసుకుంటూ రేపటిని తలచుకుని ప్రతి రోజూ బాధపడుతున్నారు. మరి ఈ కాలంలో జరిగిన అనేక అంశాలు.. ఎందరికో పాఠాలు నేర్పాయి.

విడుదల కావాల్సిన సినిమాలు క్లైమాక్స్ తేలని కథలా కన్ఫ్యూజన్ లో ఉన్నాయి. షూటింగ్ లో ఉన్న సినిమాలు లొకేషన్ లేని షాట్ లా నిర్లిప్తంగా మారాయి. ఇక వారం పది రోజులు మాత్రమే షూటింగ్ ఉన్న సినిమాల పరిస్థితి మరీ దారుణం. అప్పటికే తెచ్చిన వడ్డీలతో నిర్మాతల బ్రతుకులు దుర్లభంగా మారాయి. మరోవైపు ఫైనాన్సియర్స్ సైతం వడ్డీలు తగ్గించేందుకు పెద్దగా ముందుకు రాలేదు. ఇక సినిమా కార్మికులను ఆదుకునేందుకు ఇండస్ట్రీ పెద్దలు పెద్ద మనసు చేసుకుని.. కరోనా క్రైసిస్ ఛారిటీ స్థాపించారు. అందులో నిత్యావసర సరకులు పంచారు. ఒక నెలా, రెండో నెలా ఆదుకున్నారు. కానీ ఇప్పుడు ఎన్ని నెలల పాటు పస్తులు అనేదే తేలడం లేదు. మరి తర్వాతి రోజుల్లో కేవలం ఇండస్ట్రీనే నమ్ముకున్న కార్మికులు, చిన్న నటుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. షూటింగ్ ఉంటే.. తిన్నా తినకున్నా ఆ కెమెరా, యాక్షన్, కట్ అనే మాటలతో కడపు నింపుకున్న బడుగులు ఎందరో ఇప్పుడు బతికేందుకే నానా తంటాలు పడుతున్నారు. ఇన్ని కష్టాలు తెచ్చిన కోవిడ్ 19… 2020లో సినిమా పరిశ్రమలకు చుక్కలు చూపిస్తోందనే చెప్పాలి.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here