శునకాలకు పదవీవిరమణ వేడుక నిర్వహించి ఘనంగా సత్కరించిన  సిఐఎస్ఎఫ్

CISF honored dog with retirement ceremony

కుక్కలే కదా అని తక్కువ అంచనా వెయ్యొద్దు. అవి కూడా గౌరవంగా బ్రతకగలవు. దేశం కోసం పని చెయ్యగలవు. సగర్వంగా సన్మానాలు, సత్కారాలు పొందగలవు. ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే ఢిల్లీ లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) లో భాగమైన ఏడు కుక్కలు పారా మిలటరీ ఫోర్స్‌తో కలిసి ఎనిమిదేళ్లు సేవలందించిన తరువాత అవి పదవీ విరమణ పొందాయి.  అయితే  మంగళవారం పూర్తి గౌరవాలతో ఆ జాగిలాల పదవీవిరమణ ఉత్సవాన్ని నిర్వహించారు. “కుక్కగా పుట్టి, సైనికులుగా  పదవీ విరమణ చేశాయి ” అని సిఐఎస్ఎఫ్ తన ట్విట్టర్ ఖాతాలో వీటిని ఉద్దేశించి పోస్ట్ పెట్టింది. అంతేకాదు రిటైర్మెంట్ ఫంక్షన్ కు సంబంధించిన ఫోటోలను సైతం షేర్ చేసింది.
ఇవి  మెట్రోకు అనుసంధానించబడిన సిఐఎస్ఎఫ్ బృందంలో భాగంగా ఉన్నాయి.ఢిల్లీ  మెట్రోకు చెందిన సిఐఎస్ఎఫ్ యూనిట్ (డిఎంఆర్‌సి) నిర్వహించిన కార్యక్రమంలో రిటైర్డ్  జాగిలాలకు మెమెంటోలు, పతకాలు, సర్టిఫికెట్లు ఇచ్చారు. మెడలో పతకాలు చాలా దర్పంగా కనిపించిన ఈ కుక్కలను చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎనిమిదేల్లపాటు లక్కీ, లవ్లీ , జెస్సీ తదితర శునకాలు తమ సేవలను అందించి ఇప్పుడు పదవీవిరమణ పొందాయి. ఇప్పుడు ఈ శునకాలను ఎన్నారైలకు అప్పగించనున్నారు. ఇంతకాలం తమతో కలిసి సేవలు అందించిన ఆ శునకాలకు సిఐఎస్ఎఫ్ సిబ్బంది గౌరవ వందనం చేశారు. సిఐఎస్ఎఫ్ చరిత్రలో మొదటిసారిగా శునకాలకు  “రిటైర్మెంట్” ఫంక్షన్‌ను నిర్వహించి అందరితో ఔరా అనిపించుకుంది .

tags :  Central Industrial Security Force, CISF,Delhi, Seven dogs,  Retirement function, medals, certificates, para military force

సమ్మె యథాతథం…కొనసాగుతున్న ఆర్టీసీ కార్మిక పోరాటం

ఈఎస్ఐ కుంభకోణంలో లోతుగా దర్యాప్తు

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article