ఇంకెన్నాళ్లీ.. ఆక్రమణలు!

City lakes destroyies

చెరువుల రక్షణకు సరైన చర్యలు తీసుకోనందువల్లే ఇటీవల కురిసిన వర్షాలకు జంట నగరాలు అతలాకుతలమయ్యాయి. రామన్నకుంట, నాగోలు సమీపంలో బండ్లగూడ చెరువు, రామంతాపూర్‌లోని చిన్నచెరువు, మల్కాచెరువు, షామీర్‌పేట్‌ ట్యాంక్‌, నల్ల చెరువు, గోసాయ్‌ కుంట, ఎర్రకుంట తదితర చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని పలువురు ఆరోపిస్తున్నారు. పురపాలకశాఖ, చెరువుల సంరక్షణ కమిటీలు 3,534 చెరువులను సర్వే చేయాలని నిర్ణయించగా 3,029 చెరువుల సర్వే మాత్రమే పూర్తయ్యిందని తెలుస్తోంది. మిగిలిన చెరువుల సర్వే చేయలేదని ఇతర పార్టీల నాయకులు అంటున్నారు. చెరువుల రక్షణకు సరైన చర్యలు లేకపోవడం వల్లనే వరదలు వస్తున్నాయని హైకోర్టు కూడా తెలంగాణ ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది.

చెరువుల ఆక్రమణలు, నాలాల అనుకోని ఇళ్లు కట్టడం, పూడీక తీయకపోవడం పలు కారణాల వల్లనే భారీగా నష్టం జరిగినట్లు తెలుస్తోంది. దాంతోపాటు నవాబుల కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థ నేటికి కొనసాగుతోంది. అందుకే ఏ చిన్నపాటి వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమవుతోంది. తోతట్టు ప్రాంతాలు నీట మునగుతున్నాయి. సిటీ శివారులోని ఉన్న చెరువులను కబ్జా చేయడం వల్ల వరద నీరు లోతట్టు ప్రాంతాలకు ప్రవహిస్తోంది. గతంలో పడ్డ వర్షాలే మళ్లీ పడితే ఇంకా హైదరాబాద్ నీట మునిగే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా నాలాలు, చెరువుల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *