Clash Between two groups of SRM University
చెన్నై ఎస్ఆర్ఎం కాలేజీలో తెలుగు, తమిళ బీటెక్ విద్యార్థుల గ్యాంగ్ వార్ కలకలం రేపింది. క్యాంటీన్ వద్ద జరిగిన ఘర్షణ చిలికి చిలికి గాలివానగా మారింది . ఒకరిపై మరొకరు కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఒక్కసారి కాలేజీలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.క్యాంటీన్ వద్ద జరిగిన ఈ ఘటనతో తోటి విద్యార్థులు షాక్కు గురయ్యారు. ఓ విద్యార్థి చేతిలో గన్ చూసి మరికొందరు విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారు. ఏం జరుగుతుందో తెలియక కొందరు విద్యార్థులు తలోదిక్కుకు పరుగు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. స్టూడెంట్స్ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఎస్ఆర్ఎం కాలేజీలో విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు . ఎప్పుడు ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితిలో ఉన్నారు.