మర్లవ గ్రామంలో వైకాపా, టీడీపీ ఘర్షణ

కాకినాడ:పెద్దాపురం మండలం మర్లవ గ్రామంలో గ్రామ సభలో వైసీపీ- టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. కుర్చీలు,టెంట్ కర్రలతో ఇరువర్గాలు కొట్టుకున్నాయి. ఘటనలో నలుగురు టీడీపీ, ముగ్గురు వైసీపీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. సచ్చివాలయానికి స్థలం లేని కారణంగా పంచాయతీలో కొనసాగించాలని గ్రామ సభలో అధికారులు ప్రకటించారు. అయితే సచివాలయానికి 40 లక్షల రూపాయలు నిధులు మంజూరు కావడంతో సచ్చివాలయం నిర్మించాలని టీడీపీ కార్యకర్తల డిమాండ్ చేయడంతో వివాదం చెలరేగింది. అధికారుల సమక్షంలోనే కొట్లాటకు అధికార, విపక్ష కార్యకర్తలు దిగారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article