పాతబస్తీలో ఘర్షణ

Clashes in  OLD … 14 మందికి గాయాలు

భాగ్యనగరిలోని పాతబస్తీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒక పాన్ షాప్ దగ్గర జరిగిన ఘర్షణ చిలికిచిలికి గాలివానైంది. దీంతో అల్లరి మూకలు రాళ్ల దాడులకు పాల్పడ్డాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు 114 సెక్షన్ విధించారు. దాడులకు పాల్పడే వారిని చెదరగొట్టారు. ఈ ఘర్షణలో 14 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పాతబస్తీలో బుధవారం అర్ధరాత్రి ఇరువర్గాలు సరస్పరం రాళ్ల దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 14 మందికి గాయాలు అయ్యాయి. వివరాళ్లోకి వెళ్తే.. పురానాపూల్‌లో ఒక వివాహ వేడుక అనంతరం కొందరు యువకులు కిళ్లీలు కట్టించుకుని చిల్లర డబ్బుల గురించి పాన్‌షాప్‌ నిర్వాహకుడిపై చేయిచేసుకోవడంతో వివాదం నెలకొంది. అనంతరం పరస్పరం రాళ్లదాడులు మొదలై కోకాకితట్టీ నుంచి గుడ్‌విల్‌కేఫ్‌ వరకు కొనసాగాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలికి చేరుకుని దాడులకు పాల్పడే వారిని చెదరగొట్టారు. జనం గుమికూడకుండా 144 సెక్షన్‌ విధించారు. వదంతులకు ఆస్కారం లేకుండా చేసేందుకు మొబైల్‌ నెట్‌వర్క్‌ను నిలిపివేశారు. నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ సహా పలువురు పోలీసు ఉన్నతాధికారులు బందోబస్తును పర్యవేక్షించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article