మూసీ ప్రక్షాళన అయ్యేనా?

70

మెరుగైన మురుగునీటి వ్యవస్థ నిర్మాణం కోసం పెరిఫెరల్ సర్కిల్స్ కు రూ. 3100 కోట్లు, మూసీ మురుగు నీటి ప్రక్షాళనకు రూ.1200 కోట్లు వెరసి రూ.5540 కోట్ల ఖర్చు అంచనా అవుతోంది. అయితే, 2020-21 బడ్జెట్లో మురుగు వ్యవస్థ ఆధునీకరణకు రూ.200 కోట్లు కేటాయించింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టును ప్రకటించి ఐదేళ్లు అయ్యింది.. మధ్యలో బ్యాంకుల నుంచి రుణం కూడా తీసుకున్నారు. మరి, ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది?

  • ప్రధాన నగరంలోని డ్రైనేజి వ్యవస్థను ఆరు జోన్లుగా విభజించారు. అవరోధాలకు అవకాశం లేకుండా, ఆక్రమణలకు తావులేకుండా, మురుగునీరు రోడ్ల మీదికి రాకుండా మెరుగైన మురిగినీటి నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు డ్రోన్‌ సాయంతో మూసీ నదీతీర అభివృద్ధి సంస్థ (ఎమ్మార్డీసీ) 57.7 కి.మీ. పొడువైన మూసీకి ఇరువైపులా టోపోగ్రఫిక్‌ సర్వే పూర్తిచేసింది. మూసీ నది అభివృద్ధి కోసం మూసీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, రూ.1665 కోట్లకు పరిపాలనాపరమైన అనుమతులైతే మంజూరు చేశారు. అయినా, ఇంతవరకూ పనులెందుకు ఆరంభం కాలేదు? కానీ, ప్రభుత్వమైతే ఇంకా మూసీ ప్రక్షాళన చేస్తామని ప్రకటిస్తూనే ఉంది. పనులు చేయనప్పుడు ప్రచారం ఎందుకో అని ప్రజలు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here