పుల్వామా మృతుల కుటుంబాలకు తెలంగాణ సాయం

CM ANNOUNCE 25 LAKSHS TO JAWANS

జమ్మూకాశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థికసాయం ప్రకటించింది. ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున సాయం అందజేయనున్నట్టు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల్లో తీర్మానం ప్రవేశపెట్టారు. సభ ప్రారంభమైన వెంటనే ఈ అంశంపై సీఎం ప్రకటన చేశారు. దాడిలో అమరులైన వీరజవాన్లకు నివాళి ప్రకటించిన అనంతరం కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ స్వాగతించాయి. కాంగ్రెస్ తరఫున సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దేశ సైనికుల త్యాగం మరువలేదని పేర్కొన్నారు. అమర జవాన్ల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఆర్థికసాయం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని పూర్తిగా సమర్థిస్తున్నట్టు చెప్పారు. అనంతరం ఎంఐఎం, బీజేపీ కూడా ఈ తీర్మానాన్ని స్వాగతించాయి. తర్వాత అమర జవాన్లకు నివాళిగా సభ రెండు నిమిషాులు మౌనం పాటించింది.

TS POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article