రెండు కుండలు పగలగొట్టమన్న సీఎం చంద్రబాబు

CM Chandrababu Breaks Two Coconuts – మోడీ టూర్ కి నిరసన..

ఏపీపై యుద్ధం చేయడానికి ప్రధాని వస్తున్నారని ఆరోపించారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి చేయాల్సినంత అన్యాయం చేసిన ప్రధాని… వ్యవస్థలను నాశనం చేశారని విమర్శించారు. టీడీపీ నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎగతాళి చేయడానికే ఏపీకి మోడీ వస్తున్నారని అన్నారు. వైసీపీ భరోసా ఇవ్వడం వల్లే మోడీ రాష్ట్రానికి వస్తున్నారని.. రాష్ట్ర ప్రజలకు జగన్ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఇవాళ్టి నుంచి రేపటివరకు శాంతియుత నిరసనలు తెలపాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. శాంతిభద్రతలకు భంగం కలిగించవద్దని సూచించారు.
’మోడీ పర్యటనను నిరసిస్తూ రెండు కుండలు పగలగొట్టండి. మోడీ, జగన్ లాలూచీకి రెండు కుండలు సంకేతం. వైసీపీ భరోసాతోనే మోడీ ఏపీకి వస్తున్నారు’. ఏపీ ప్రజలకు జగన్ క్షమాపణ చెప్పాలి. కేంద్రం ద్రోహంపై జగన్ ఎందుకు నోరెత్తడం లేదు.ఎక్కడ దాక్కున్నావ్ జగన్ బయటకు రా అంటూ చంద్రబాబు జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ పాలనలో దేశానికి ఒరిగిందేమీలేదు. రాష్ట్రాల్లో నాయకత్వాన్ని దెబ్బతీశారు. బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ ఏజెంట్ అని విమర్శించారు. మొత్తానికి చంద్రబాబు పిలుపు తో ఏపీలో అగ్గి రాజుకుంది. తీవ్ర ఆందోళనల నడుమ మోడీ టూర్ జరగనుంది.

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article