కేసీఆర్ స్పూర్తితో … TO become CM Chandrababu Doing Chandi Yagam
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీఎం కేసీఆర్ బాట పట్టారా ? తెలంగాణ సీఎం కెసిఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి తాజాగా సహస్ర చండీ యాగం నిర్వహిస్తే, చంద్రబాబునాయుడు మళ్లీ సీఎం కావాలంటే ఏపీలో జరగబోతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. జాతకాలను ,ముహూర్తాలను, యజ్ఞయాగాలను నమ్మి కెసిఆర్ రాజకీయాల్లో ముందుకు దూసుకు పోతున్నాడు అని భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ నేతలు చాలా మంది కేసీఆర్ బాట పడుతున్నారు. పూజలు పునస్కారాల తో భగవంతుని మీద భారం వేస్తున్నారు. అందులో భాగంగా చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ఆదివారం చండీయాగాన్ని నిర్వహిస్తున్నారు. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం పుష్కరఘాట్‌లో ఈ చండీయాగాన్ని నిర్వహిస్తున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఈ యాగం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఈ చండీయాగంలో పాల్గొననున్నారు.
యజ్ఞాలు యాగాలు చేస్తే కెసిఆర్ కు కలిసొచ్చినట్టు చంద్రబాబుకు సైతం కలిసి రావాలని టిడిపి నేతలు చేస్తున్న చండీ యాగం రానున్న ఎన్నికల్లో చంద్రబాబునాయుడుకు అధికారం కట్టబడుతుందా అనేది వేచి చూడాలి.
For More Click Here